
చీకట్లో పనిచేస్తున్నప్పుడు.. ముఖ్యంగా ఫిషింగ్లాంటివి చేస్తుంటే వెలుతురు కోసం టార్చ్లైట్లను వెంట తీసుకెళ్తుంటాం. కానీ.. చేతులకు ఈ గ్లవ్స్ వేసుకుంటే.. ప్రత్యేకంగా టార్చ్ లైట్లతో పనిలేదు. జెనరిక్ కంపెనీ తీసుకొచ్చిన ఈ గ్లవ్స్‌లో ఇన్‌బిల్ట్‌గా లైట్లతోపాటు బ్యాటరీలు కూడా ఉంటాయి.
బ్యాటరీని మార్చడం కూడా సులభం. ఈ గ్లవ్స్ని హై క్వాలిటీ కాటన్ మెటీరియల్‌తో తయారుచేశారు. పొజిషన్ అడ్జస్ట్ చేసుకోవడానికి ప్రత్యేకంగా మ్యాజిక్ స్ట్రాప్‌తో వస్తుంది. చీకటి ప్రదేశాల్లో చేపలు పట్టేటప్పుడు, రిపేర్లు, హైకింగ్, క్యాంపింగ్ చేస్తున్నప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది.