- ఇద్దరు మహిళా మంత్రుల రాక
మెదక్, వెలుగు: మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చైర్మన్‌గా ఉన్న మైనంపల్లి సోషల్ సర్వీస్ఆర్గనైజేషన్(ఎంఎస్ఎస్ వో) ఆధ్వర్యంలో మంగళవారం మెదక్ పట్టణంలో మన ఇంటి బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు స్థానిక గవర్నమెంట్బాయ్స్హైస్కూల్గ్రౌండ్లో భారీ ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి రాష్ట్ర మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర మహిళా కమిషన్చైర్పర్సన్శారద, తదితరులు హాజరుకానున్నారు.
సోమవారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బతుకమ్మ సంబరాల ఏర్పాట్లు పర్యవేక్షించారు. మహిళలు ఎక్కువ సంఖ్యలో తరలిరానున్నందున ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని డీఎస్పీ ప్రసన్నకుమార్‌కు సూచించారు. ఆయన వెంట మున్సిపల్‌చైర్మన్ చంద్రపాల్, కాంగ్రెస్నాయకులు సుప్రభాత్రావు, జీవన్‌రావు, అశోక్, ఆంజనేయులు, పరుశరాం ఉన్నారు.