ప్రముఖ రెజ్లర్లు వినేష్ ఫోగట, బజరంగ్ పునియా కాంగ్రెస్ లో చేరడంతో వస్తున్న అస్యత ప్రచారాలను మరో రెజ్లర్ సాక్షి మాలిక్ తప్పుబట్టారు. మా ఆందోళన, మహిళ ల కోసం పోరాటాన్ని తప్పుగా చూపించొద్దని అన్నారు.
వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ లో చేరాలనే నిర్ణయం గురించి స్పందించిన సాక్షి మాలిక్.. వారు పార్టీలో చేరడం అనేది వ్యక్తిగతం.. వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాతోపాటు తాను న్యాయపోరాటంలో ఎలాంటి త్యాగానికి సిద్ధంగా ఉన్నట్లు సాక్షి మాలిక్ చెప్పారు.
Also Read :- యూఎస్ ఓపెన్ ఫైనల్లో సబాలెంకా.. పెగులాతో టైటిల్ ఫైట్
మహిళల కోసం మా ఆందోళన ఆగదు.. నా వైపు నుంచి ఆందోళన కొనసాగుతుంది.. వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా కూడా కలిసి వస్తారని నమ్ముతున్నా.. ఫెడరేషన్ ప్రక్షాళన అయితేనే మా పోరాటానికి అర్థం ఉంటుందని సాక్షి మాలిక్ చెప్పారు.
తనను కూడా రాజకీయ నేతలు సంప్రదించారు.. అయితే రాజకీయ రంగ ప్రవేశం చేసే ఉద్దేశం తనకు లేదని సాక్షి మాలిక్ వెల్లడించింది. వినేష్ ఫోగట్, బజరంగ్ ఫునియా తరపున మీరు రాజకీయ ప్రచారం చేస్తారని అడిగితే.. తాను రాజకీయ వ్యక్తి కాదు.. ఏ రాజకీయ పార్టీతోనూ అనుబంధం లేదని చెప్పింది సాక్షి మాలిక్.