LSG vs MI: ‘వాడు ఎక్కడున్నా రాజేరా’: రోహిత్ శర్మ మాస్టర్ ప్లాన్‎కు నికోలస్ పూరన్ ఔట్

LSG vs MI: ‘వాడు ఎక్కడున్నా రాజేరా’: రోహిత్ శర్మ మాస్టర్ ప్లాన్‎కు నికోలస్ పూరన్ ఔట్

ఐపీఎల్ 18లో భాగంగా శుక్రవారం (ఏప్రిల్4) లక్నోలోని ఏకనా స్టేడియంలో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడ్డ విషయం తెలిసిందే. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచులో చివరికి అతిథ్య లక్నో జట్టు అద్భుత విజయాన్ని సాధించింది. లక్నో బౌలర్స్ శార్థుల్ ఠాగూర్, అవేశ్ ఖాన్ చివర్లో అద్భుతమైన బౌలింగ్‎తో జట్టుకు విజయాన్ని అందించారు. ఇదిలా ఉంటే.. లక్నో ఇన్సింగ్స్‎లో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

గాయం కారణంగా ఈ మ్యాచుకు దూరమైన రోహిత్.. గ్రౌండ్లోలోకి దిగకుండానే ముంబైకి వికెట్ సాధించి పెట్టాడు. అదేలాగంటే.. ఈ మ్యాచులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‎కు దిగిన లక్నోకు అద్భుతమైన ఆరంభం దక్కింది. పవర్ ప్లేలో లక్నో ఓపెనర్స్ మార్ష్, మార్కరం పరుగుల వరద పారించారు. దీంతో లక్నో భారీ స్కోర్ దిశగా పయణిస్తోంది. ఈ క్రమంలో మార్ష్ ఔట్ కావడంతో క్రీజులోకి వచ్చిన డేంజరస్ ప్లేయర్ నికోలస్ పూరన్ మిచెల్ సాంట్నర్ వేసిన 8వ ఓవర్‌లో సిక్స్, ఫోర్ కొట్టి జోరు మీద ఉన్నాడు. 

Also Read:-న్యూజిలాండ్‌తో వైట్ వాష్.. కోపంతో అభిమానులని కొట్టబోయిన పాక్ క్రికెటర్

పూరన్ విధ్వంసకరంగా మారతుండటంతో డగౌట్లో కూర్చొన్న రోహిత్ శర్మ.. ముంబై కెప్టెన్ పాండ్యాకు ఒక అద్భుతమైన సలహా ఇచ్చాడు. దూకుడు మీద ఉన్న పూరన్‎ను ఔట్ చేసేందుకు స్లో బాల్స్, ఆఫ్ కట్టర్స్ వేయాలని హిట్ మ్యాన్ సూచించాడు. ఇన్సింగ్స్ తొమ్మిదో ఓవర్ వేసిన పాండ్యా.. రోహిత్ చెప్పినట్లుగానే నికోలస్ పూరన్‎కు స్లో-బాల్ బౌన్సర్‌ వేశాడు. ఈ బంతిని భారీ షాట్ ఆడబోయిన పూరన్ క్యాచ్ ఔట్ అయ్యాడు. 

తన ప్లాన్ వర్క్ ఔట్ కావడంతో డగౌట్లో కూర్చొన్న రోహిత్ శర్మ స్మైల్ ఇచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. దీంతో రోహిత్ శర్మ ఫాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘వాడు ఎక్కడున్నా రాజేరా’ అంటూ కామెంట్స్‎ చేస్తూ హిట్ మ్యాన్‎పై పొగడ్తలు కురిపిస్తున్నారు. మొత్తానికి రోహిత్, పాండ్యా వ్యూహాత్మకంగా ఔట్ చేయడంతో నికోలస్ పూరన్ 12 పరుగులకే పెవిలియన్ చేరాడు.