7 రాష్ట్రాల్లోని అసెంబ్లీ బైపోల్ రిజల్ట్ : 5 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం

దేశ వ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ ఎన్నికలకు కౌంటింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమయ్యింది.పశ్చిమ బెంగాల్ లోని 4, హిమాచల్ ప్రదేశ్ లోని మూడు, ఉత్తరాఖండ్ లోని, రెండు, పంజాబ్, బీహార్,తమిళనాడు, మధ్యప్రదేశ్  లోని ఒక్కో స్థానానికి జూలై 10న ఎన్నికలుజరిగాయి. ఇప్పటి వరకు వెలువడి ఫలితాల్లో కాంగ్రెస్ 5,  టీఎంసీ 4, బీజేపీ, డీఎంకే, ఆప్, జేడీయూ ఒక్కో స్థానంలో లీడింగ్ లో కొనసాగుతున్నాయి. 

ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, మంగళూర్ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు  రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.బద్రీనాథ్‌లో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర భండారీపై కాంగ్రెస్ అభ్యర్థి లఖ్‌పత్ సింగ్ బుటోలా 195 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, బీఎస్పీకి చెందిన ఉబెదుర్ రెహ్మాన్‌పై కాంగ్రెస్‌కు చెందిన ఖాజీ నిజాముద్దీన్ 1,586 ఆధిక్యంలో ఉన్నారు. గతంలో నిజాముద్దీన్ మూడుసార్లు గెలిచిన మంగ్లౌర్‌లో బీజేపీకి చెందిన కర్తార్ సింగ్ భదానా మూడో స్థానంలో ఉన్నారు. ఆప్‌కి చెందిన జలంధర్ వెస్ట్ అసెంబ్లీ ఉపఎన్నిక అభ్యర్థి మొహిందర్ భగత్ తన సమీప ప్రత్యర్థి .. కాంగ్రెస్ అభ్యర్థి సురీందర్ కౌర్‌పై 23,000 ఓట్లకు పైగా ఆధిక్యంలో  ఉన్నారు.