
పూణేలో నగరం నడిబొడ్డున ఆగి ఉన్న బస్సులో మహిళపై అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. నగరం నడిబొడ్డున పోలీస్ నష్టేషన్ కి సమీపంలో ఉన్న బస్ స్టాండ్ లో ఘటన జరగటంతో చర్చనీయాంశం అయ్యింది. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు త్తాత్రయ రామ్‌దాస్ గాడే కోసం గాలిస్తున్నారు పోలీసులు. 13 బృందాలతో దర్యాప్తు చేస్తున్న పూణే పోలీసులు నిందితుడిని పట్టిస్తే రూ. లక్ష బహుమానం ఇస్తామని ప్రకటించారు. నిందితుడు పరారీలో ఉన్నాడని.. మాస్క్ వేసుకొని తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని పట్టుకునేందుకు డాగ్ స్క్వాడ్ ని కూడా రంగంలోకి దింపామని తెలిపారు పోలీసులు.
మంగళవారం ( ఫిబ్రవరి 25, 2025 ) ఉదయం పూణేలోని స్వర్గేట్ డిపోలో ఆగి ఉన్న ఆర్టీసీ బస్సులో 26 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు రాందాస్ గాడే. రాందాస్ గాడే గతంలో ఒక క్రిమినల్ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చాడని... శిరూర్, శిక్రపూర్, స్వర్గేట్ పోలీస్ స్టేషన్లలో అతనిపై అనేక క్రిమినల్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.
మరణ శిక్ష తప్ప వేరే శిక్ష లేదు:
ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి, నిందితులను వీలైనంత త్వరగా అరెస్టు చేయాలని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ పూణే పోలీసులను ఆదేశించారు. స్వర్గేట్ బస్ స్టేషన్‌లో జరిగిన అత్యాచార సంఘటన అత్యంత దురదృష్టకరం, బాధాకరమని.. నాగరిక సమాజంలో ఇలాంటి ఘటనలు జరగటం సిగ్గు చేటు అని అన్నారు అజిత్ పవార్.అత్యాచారం క్షమించరాని నేరం అని.. నిందితుడు రాందాస్ గాడేకి మరణశిక్ష తప్ప వేరే శిక్ష లేదని అన్నారు అజిత్ పవార్.
పూణే అత్యాచార కేసు:
బాధిత మహిళ మంగళవారం ( ఫిబ్రవరి 25 ) ఉదయం 5: 45 గంటల ప్రాంతంలో సతారా లోని ఫాల్తాన్ కు వెళ్లేందుకు బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తుండగా ఘటన జరిగింది.బాధితురాలు బస్సు కోసం వేచి ఉండగా, నిందితుడు ఆమె దగ్గరకు వచ్చి సతారాకు వెళ్లే బస్సు మరొక ప్లాట్‌ఫారమ్ వద్దకు వచ్చిందని చెప్పి నమ్మించి.. ఖాళీగా ఉన్న శివ షాహి బస్సు దగ్గరకి తీసుకెళ్లాడు. బస్సులో ఎవరూ లేకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చి అడగగా ఆమెను లోపలి లాకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు చెబుతోంది.