దేవరకొండ,వెలుగు: దేవరకొండ పట్టణ శివారులోని పెంచికల్‌పాడ్ వద్ద నూతనంగా నిర్మించిన అవుట్డోర్ స్టేడియాన్ని వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని ఎమ్మెల్యే బాలూనాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన స్టేడియాన్ని పరిశీలించి నిర్మాణం పూర్తయినా అందుబాటులోకి తీసుకురాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం రాష్ర్టీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ నూతన క్యాలండర్‌ను ఆవిష్కరించారు. భాషా పండితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, స్పోర్ట్స్అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్పీటీ పాల్గొన్నారు.