ఔటర్​ ।& 2 ప్రాజెక్టులు పూర్తి.. హైదరాబాద్​లో కొత్తగా11 లక్షల మందికి నీళ్లు!

ఔటర్​ ।& 2 ప్రాజెక్టులు పూర్తి.. హైదరాబాద్​లో కొత్తగా11 లక్షల మందికి నీళ్లు!
  • మిగిలిన 20 శాతం మందికి నీళ్లివ్వడానికి ఔటర్​ప్రాజెక్ట్​–3
  • సర్కారు అనుమతిచ్చిన వెంటనే పట్టాలెక్కనున్న ప్రాజెక్టు 
  •   ఇప్పటికే రెండు దశలతో 80 శాతం మందికి నీళ్లు

హైదరాబాద్​సిటీ, వెలుగు : గ్రేటర్​హైదరాబాద్​పరిధి విస్తరిస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టు తాగునీటి సరఫరా పరిధిని విస్తరించేందుకు వాటర్​బోర్డు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఔటర్​వాటర్​ప్రాజెక్టు పేరుతో రెండు దశల పనులను పూర్తి చేసిన అధికారులు ఈ జనవరి నుంచి ఓఆర్ఆర్​పరిధిలోని ప్రాంతాల్లో ఉంటున్న సుమారు 11 లక్షల మందికి తాగునీటిని అందిస్తోంది. 20 శాతం ఏరియాలు మిగలగా, ఆ పరిధిలోని జనాలకూ తాగునీరందించడానికి ప్రాజెక్టు-3ని మొదలుపెట్టబోతోంది. ప్రభుత్వం నుంచి గ్రీన్​సిగ్నల్​ఇవ్వగానే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతున్నది. 

ఔటర్​ వాటర్​ ప్రాజెక్ట్​–1,2 తో.. 

ఔటర్ వాటర్​ప్రాజెక్ట్​–1లో భాగంగా రింగ్​రోడ్​పరిధిలోని ప్రాంతాలకు తాగునీరందించేందుకు వాటర్​బోర్డు 70 మిలియన్​లీటర్ల  కెపాసిటీ గల 164 రిజర్వాయర్లను రూ.124 కోట్లతో నిర్మించింది. రూ.527 కోట్లతో 1601 కిలోమీటర్ల మేర పైప్​లైన్​వ్యవస్థ నిర్మించింది. వీటితో 4,25,385 మందికి తాగునీటిని అందిస్తున్నారు. 

ఔటర్​ప్రాజెక్ట్​–2తో 6,56,185 మందికి తాగునీళ్లివ్వడానికి 140.50 ఎంఎల్​కెపాసిటీ ఉన్న 71 రిజర్వాయర్లను రూ. 189కోట్లతో నిర్మించింది. 2758 కిమీ. పరిధిలో రూ.778 కోట్లతో పైప్​లైన్​వ్యవస్థ నిర్మించింది. మొదటి దశలో43,857 కనెక్షన్లు, రెండో దశ ద్వారా 63,270 కనెక్షన్లు మంజూరు చేసింది. 670 కి.మీ. పరిధి మిగలగా, ఆ ఏరియాల్లో పైన్​లైన్​వ్యవస్థను ఔటర్​ వాటర్​ ప్రాజెక్టు–3లో నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇది ఓకే అయితే, వచ్చే ఏడాది నుంచి మిగిలిన ఏరియాలకు 
తాగునీళ్లందించనున్నారు.