హైదరాబాద్ తరహాలో ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. ఉమ్మడి జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం ఓకే చెప్పిందన్నారు. కొన్నిచోట్ల పనులు జరుగుతున్నాయన్నారు. జిల్లా సుందరీకరణలో భాగంగా నేషనల్ హైవేలు నిర్మించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ఖమ్మం పట్టణం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తామన్నారు.
పట్టణంలో రోడ్లను ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానం చేసేందుకు 654 కోట్ల నిధులు మంజూరైనట్టు తెలిపారు. జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించిన సీఎం రేవంత్, కేంద్రమంత్రి గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు తుమ్మల.