డార్క్ మోడ్ లో ‘ఔట్ లుక్ యాప్’

డార్క్ మోడ్ లో ‘ఔట్ లుక్ యాప్’

ఈ–మెయిల్ అకౌంట్స్, క్యాలెండర్, ఫైల్స్ వంటి అన్నింటినీ ఒక దగ్గరినుంచే యాక్సెస్ చేసే వీలు కల్పిస్తుంది ‘ఔట్ లుక్’. మైక్రోసాఫ్ట్ రూపొందించిన ఈ యాప్ ఇప్పుడు డార్క్ మోడ్ లో అందుబాటులోకి రానుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైళ్లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. యూజర్లు యాప్ లో సెట్టింగ్స్ లోకి వెళ్లి థీమ్ మార్చుకోవడం వల్ల డార్క్ మోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ వల్ల బ్యాటరీ సేవ్ అవుతుంది. దీనికి రెగ్యులర్ గా కంటే తక్కువ బ్యాటరీ యూజ్ అవ్వడం వల్ల ఫోన్ బ్యాటరీ ఎక్కువసేపు వస్తుంది. ఆండ్రాయిడ్ యూజర్లు ‘లో బ్యాటరీ’ ఉన్నప్పుడు ఆటోమేటిగ్గా డార్క్ మోడ్ ఆన్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. ఇప్పటికే గూగుల్ కు సంబంధించిన ఫొటోస్, గూగుల్ యాప్, ఫైల్స్ వంటి కొన్ని యాప్స్ లో డార్క్ మోడ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.