
హైదరాబాద్, వెలుగు: ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడంలో భాగంగా యూనియన్ బ్యాంక్ బుధవారం హైదరాబాద్ నాచారంలో ఔట్రీచ్ క్యాంప్ నిర్వహించింది. దీనిని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఎంఎస్ఎంఈల కోసం బ్యాంకు అందజేస్తున్న ఫైనాన్షియల్ ప్రొడక్టుల గురించి అధికారులు ఈ సందర్భంగా వివరించారు.
మహిళా ఎంఎస్ఎంఈ ఎంట్రప్రిన్యూర్ల కోసం యూనియన్ నారీశక్తి స్కీమ్ ఉందని చెప్పారు. దాదాపు 300 మంది ఎంఎస్ఎంఈల యజమానులు, ఎస్‌హెచ్‌జీ కస్టమర్లు క్యాంపునకు వచ్చారు. రూ.50 కోట్ల విలువైన లోన్లను వారికి అందిచారు. కార్యక్రమంలో బ్యాంకు ఆఫీసర్లు రఘునాథ్, భాస్కర రావు, సుధాకర రావు, రజీబ్ లోన్తదితరులు పాల్గొన్నారు.