హైదరాబాద్, వెలుగు:‘పవర్ ప్రాజెక్టు’ కింద రైతులను టై అప్ చేయడానికి కోఠిలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ శాఖ..సరూర్నగర్ రైతు బజార్‌లో ఔట్‌రీచ్ ప్రోగ్రామ్ను నిర్వహించింది. బ్యాంక్ అధికారులు రైతులకు పొదుపు ఖాతాలను తెరిచి అలారమ్‌తో ఉండే క్యూఆర్ కోడ్‌లను జారీ చేశారు. వివిధ రకాల డిపాజిట్లు, డిజిటల్ లావాదేవీల్లో ఉండే ప్రయోజనాలు, బిజినెస్ లోన్లు పొందడం గురించి రైతులకి వివరించారు. రైతు బజార్‌లో 100 శాతం డిజిటల్ లావిదేవీల కోసం యూనియన్ బ్యాంక్ సిద్ధంగా ఉందని, రాబోయే 4 రోజులు బ్యాంక్ అధికారులు రైతు
బజార్‌లో అందుబాటులో ఉంటారని రీజినల్ హెడ్ కళ్యాణ్ వర్మ అన్నారు. కార్యక్రమంలో రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ స్రవంతి రెడ్డి, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ALSO READ :కాళేశ్వరం అప్పు తీరిందా?.. 3 ఏండ్లలో రూ.80 వేల కోట్ల అప్పు ఎట్ల తీర్చారు