మహబూబాబాద్ అర్బన్, వెలుగు : తనను అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారంటూ ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సోమవారం మహబూబాబాద్ డీఈవో ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగింది. పార్వతి అనే మహిళ 2017 నుంచి మహబూబాబాద్ డీఈవో ఆఫీస్‌లో అవుట్ సోర్సింగ్ అటెండర్‌గా పనిచేస్తోంది. అయితే డ్యూటీ సక్రమంగా చేయడం లేదంటూ ఆమెను ఇటీవల ఆఫీసర్లు తొలగించారు.
దీంతో తనను అకారణంగా తొలగించారంటూ సోమవారం డీఈవో ఆఫీస్ ఎదుట కూర్చొని ఆందోళనకు దిగింది. గత పది రోజులుగా ఆఫీస్‌కు వస్తూ ఆందోళన చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తనను ఎందుకు తొలగించారో చెప్పాలని డిమాండ్ చేసింది.