పెండింగ్​ వేతనాలు చెల్లించాలి .. ఆసుపత్రి ఎదుట కార్మికుల ధర్నా 

భద్రాచలం, వెలుగు : పెండింగ్​లో ఉన్న తమ ఏడు నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని గురువారం భద్రాచలం ఏరియా ఆసుపత్రి ఎదుట కాంట్రాక్టు, ఔట్​సోర్సింగ్ ​కార్మికులు ధర్నా చేశారు. హాస్పిటల్​కాంట్రాక్టు శానిటేషన్​, సెక్యూరిటీ, పేషెంట్​ కేర్​ ల్యాబ్ వర్కర్స్ యూనియన్​(సీఐటీయూ) ఆధ్వర్యంలో ఆందోళన  నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్​ వేతనాలు వెంటనే చెల్లించకపోతే ఈనెల 17 నుంచి నిరవధిక సమ్మె చేపడుతామని హెచ్చరించారు.

కనీస వేతనం రూ.21వేలు, ఉద్యోగ భద్రత, ఈఎస్​ఐ, పీఎఫ్​, రూ.10లక్షల బీమా ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్​ రామకృష్ణకు వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ నాయకులు గడ్డం స్వామి, బాలనర్సారెడ్డిలతో పాటు వర్కర్స్ లీడర్లు రమా, కృష్ణ, కుమారీ, రమణ, మమత, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.