మణిపూర్ లో ఇంకా హింసాత్మక ఘటనలు చల్లరడం లేదు. మైతే, కుకీ తెగల మధ్య రగులుకున్న పోరు నడుమ అమాయకపు ప్రజలు చనిపోతున్నారు. మణిపూర్ అల్లర్లను అదుపు చేయడానికి మరో 10వేల మంది సైనికులను కేంద్రం అక్కడికి పంపనున్నట్లు ఆ రాష్ట్ర ప్రధాన భద్రతా సలహాదారు నవంబర్ 22న తెలిపారు.
పక్క రాష్ట్రం మయన్మార్ లో కేంద్ర బలగాల కంపెనీల సంఖ్య 288కి చేరుకుందని ఆయన అన్నారు. 90 కంపెనీల కేంద్ర బలగాల సిబ్బందితో మణిపూర్‌లో మోహరించగా మొత్తం కంపెనీల సంఖ్య 288కి చేరుకుందని మణిపూర్ భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్ రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో విలేకరులతో అన్నారు.
Also Read :- మహారాష్ట్రలో బీజేపీ డబుల్ సెంచరీ
మే 2023 నుంచి మణిపూర్ హింసాత్మక ఘటనల్లో 258 మంది చనిపోయారు. నవంబర్ 7న జిరిబామ్‌లోని జైరాన్ గ్రామంలో హ్మార్ తెగకు చెందిన ఒక మహిళ, ముగ్గురు పిల్లల తల్లి, అనుమానిత మైతే మిలిటెంట్‌లచే చంపబడిన తర్వాత హింస తీవ్రమైంది. దీనికి ప్రతీకారంగా, నవంబర్ 11న జిరిబామ్ యొక్క బోరోబెక్రాపై రెండు డజన్ల మంది కుకీ తీవ్రవాదులు దాడికి దిగారు.
మణిపూర్‌లో పౌరుల ఆస్తులు, ప్రాణాలకు రక్షణ కల్పించడానికి ట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్‌ఎఫ్), ఆర్మీ, అస్సాం రైఫిల్స్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి), సశాస్త్ర సీమా బల్‌తో సహా అన్ని బలగాలు కలిసి పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు.