Champions Trophy 2025: భద్రత విషయంలో నిర్లక్ష్యం.. 100 మంది పోలీసులు సర్వీస్ నుంచి తొలగింపు

Champions Trophy 2025: భద్రత విషయంలో నిర్లక్ష్యం.. 100 మంది పోలీసులు సర్వీస్ నుంచి తొలగింపు

పాకిస్తాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆటగాళ్లకు భద్రత కల్పించే విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నట్టు తెలుస్తుంది. 29 ఏళ్ళ తర్వాత పాకిస్థాన్ లో ఒక ఐసీసీ టోర్నీని నిర్వహించడం ఇదే తొలిసారి. అయితే పాకిస్థాన్ ఐసీసీ ఈవెంట్ లను నిర్వహించడం పట్ల ప్రస్తుతం ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఒక అనుమానాస్పద వ్యక్తి గ్రౌండ్ లోకి అనూహ్యంగా దూసుకురావడంతో భద్రతపై అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి.  

పాకిస్థాన్ ఐసీసీ ఈవెంట్ లను నిర్వహించడం పట్ల ప్రస్తుతం ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భద్రత విషయంలో నిర్లక్ష్యం కారణంగా 1000 మందికి పైగా పాకిస్థాన్ పోలీసులను సర్వీస్ నుంచి తొలగించారు. పంజాబ్ పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ.. "లాహోర్‌లోని గడాఫీ స్టేడియం, హోటళ్ల వద్ద జట్లకు భద్రత కల్పించడానికి పోలీసు అధికారులను నియమించారు. కానీ వారు తమ బాధ్యతలను నిర్వహించకుండా  గైర్హాజరయ్యారు". అని ఆయన అన్నారు.

Also Read : ఇకపై స్టేడియంలోకి నో ఎంట్రీ

పంజాబ్ ఐజీపీ ఉస్మాన్ అన్వర్ ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని అంతర్జాతీయ కార్యక్రమాల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించడానికి అవకాశం లేదని ఆయన అన్నారు. తొలగించబడిన పోలీసులు ఎక్కువ పని భారం వలనే విధులకు హాజరవ్వలేదని కొన్ని నివేదికలు చెప్పుకొస్తున్నాయి. ఇటీవలే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లు చూడటానికి హాజరవుతున్న విదేశీ అతిథులను కిడ్నాప్ చేయడానికి "యాక్టివ్ కోవర్ట్ గ్రూపులు" కుట్ర పన్నుతున్నాయని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ బ్యూరో అనుమానం వ్యక్తం చేసింది. దీంతో భద్రతా దళాలను హెచ్చరిస్తూ హై అలర్ట్ జారీ చేసింది.