గుజరాత్లో 1000మంది బంగ్లాదేశీయులు అరెస్ట్..

గుజరాత్లో 1000మంది బంగ్లాదేశీయులు అరెస్ట్..
  • అహ్మదాబాద్‌లో 890 మంది అరెస్టు 
  • సూరత్‌లో 134 మందికి పైగా అరెస్టు

అక్రమవలదారుల ఏరివేత ఆపరేషన్ ప్రారంభించింది గుజరాత్ ప్రభుత్వం..అహ్మదాబాద్, సూరత్ నగరాల్లో జరిపిన వేర్వేరు ఆపరేషనల్లో గుజరాత్ లో అక్రమంగా ఉంటున్న పిల్లలు, మహిళలతో సహా1000మంది బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. హోంమంత్రి హర్ష్ సింఘ్వీ ఆదేశాలకు రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ వలసదారుల కట్టడి లక్ష్యంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు గుజరాత్ పోలీసులు. 

అహ్మదాబాద్ లో 890మంది, సూరత్ లో 134 మంది అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులను అరెస్ట్ చేసినట్లు హోంమత్రి హర్ష్ సింఘ్వీ తెలిపారు. అరెస్టు చేసిన అక్రమ వలసదారులలో పురుషులు, మహిళలు, పిల్లలు కూడా ఉన్నారని రెండు నగరాల్లోని వివిధ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. దేశంలో ప్రవేశించేందుకు పశ్చిమబెంగాల్ నుంచి నకిలీ గుర్తింపుకార్డులు సంపాదించారని పోలీసులు  నిర్ధారించారు. 

►ALSO READ | భారత్-పాక్ యుద్ధం మొదలైనట్టేనా..? LoC దగ్గర బంకర్లలోకి వెళ్లిపోతున్న ప్రజలు

వీరిలో చాలామంది అనేక నేరాల్లో పాల్పంచుకున్నట్లు మంత్రి తెలిపారు.  డ్రగ్స్ సరఫరా, హ్యూమన ట్రాఫికింగ్ లో పాలు పంచుకున్నారని అన్నారు. ఇటీవల అరెస్ట్ అయిన నలుగురు బంగ్లాదేశీయుల్లో ఇద్దరు ఆల్ ఖైదా స్లీపర్ సెల్స్ లో పనిచేశారని అన్నారు.  దేశంలోని వివిధ ప్రాంతాలకు,గుజరాత్‌కు చేరుకోవడానికి వారు ఉపయోగించిన నకిలీ పత్రాలపై దర్యాప్తు  చేస్తున్నామన్నారు. ఫేక్ డాక్యమెంట్లు సృష్టించిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి హర్ష్ సింఘ్వీ.