భారత్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్,న్యూజిలాండ్ ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాయి. నోయిడాలో జరగనున్న ఈ టెస్ట్ ను చూసేందుకు అభిమానులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం టికెట్స్ బాగా అమ్ముడుపోతున్నాయి. 10 వేల మందికి పైగా ప్రేక్షకులు ఈ మ్యాచ్ కు రానున్నారని సమాచారం. భారత్ లో మ్యాచ్ అంటే ఫార్మాట్ ఏదైనా మన క్రికెట్ లవర్స్ తో స్టేడియం నిండిపోతుంది. అయితే ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచ్ కు కూడా భారీగా టికెట్స్ అమ్ముడుపోవడం ప్రస్తుతం వైరల్ గా మారింది.
ALSO READ | Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. 7 వికెట్లతో చెలరేగిన మానవ్ సుతార్
ఏకైక టెస్ట్ కోసం న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఇప్పటికే భారత్ లో అడుగుపెట్టాయి. సెప్టెంబరు 9 నుండి 13 వరకు నోయిడాలో ఈ మ్యాచ్ జరుగుతుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. భారత్ లోని స్పిన్ పిచ్ లపై ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్లు చెలరేగి కివీస్ కు షాక్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. ఈ టెస్ట్ కోసం భారత మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్‌ను న్యూజిలాండ్ తన కోచింగ్ సిబ్బందిలో చేర్చుకున్నట్లు అసోసియేషన్ శుక్రవారం (సెప్టెంబర్ 6) తెలిపింది.
ఆఫ్ఘనిస్తాన్ స్క్వాడ్:
హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, రహమత్ షా, అబ్దుల్ మాలిక్, రియాజ్ హసన్, అఫ్సర్ జజాయ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), బహిర్ షా, షాహిదుల్లా కమల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షమ్స్ ఉర్ రహ్మాన్, జియా-ఉర్-రెహ్మాన్ , జహీర్ ఖాన్, కైస్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ మరియు నిజత్ మసూద్.
న్యూజిలాండ్ స్క్వాడ్:
టిమ్ సౌతీ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, మాట్ హెన్రీ, టామ్ లాథమ్ (వైస్ కెప్టెన్), డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్క్, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, బెన్ సియర్స్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్.