ఉత్తరాఖండ్‌‌లో చిక్కుకున్న 10 వేల మంది యాత్రికులు

ఉత్తరాఖండ్ లో సుమారు 10 వేల మంది యాత్రికులు చిక్కుకపోయారు. యుమునోత్రి టెంపుల్‌‌కు దారి తీసే ప్రధాన రహదారిపై ఉన్న రక్షణ గోడ కూలిపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. వాహనాలు వెళ్లడానికి కూడా వీలు లేకపోవడంతో ఎక్కడికక్కడే యాత్రికులు నిలిచిపోయారు. ఆ మార్గంలో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. చిక్కుకున్న వారిని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నాలు చేపడుతున్నారు.

చిన్న చిన్న వాహనాల్లో ఇక్కడకు వచ్చిన వారిని ముందుగా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద పెద్ద వాహనాల్లో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు అక్కడనే ఉండాల్సిన పరిస్థితి ఉందని తెలుస్తోంది. రహదారిని పునరుద్ధరించేందుకు తమ ప్రయత్నాలు చేయడం జరుగుతోందని జాతీయ రహదారి అథార్టీ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాజేష్ పంత్ వెల్లడించారు. 

బుధవారం కురిసిన భారీ వర్షాల కారణంగా Sayanachatti, Ranachatti మధ్యనున్న రహదారి కొట్టుకపోయింది. 24 గంటల పాటు ఇక్కడ రాకపోకలను నిలిపివేశారు. శుక్రవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం యుమునోత్రి ఆలయానికి వెళ్లే రహదారిని అందుబాటులోకి తేవడానికి సుమారు మూడు రోజుల పాటు సమయం పడుతుందని అంచనా. 
 

మరిన్ని వార్తల కోసం : -

మంటలను ఆర్పేందుకు రోబోలు


సీఎం కేసీఆర్ తో అఖిలేష్ యాదవ్ భేటీ