11 లక్షల 70 వేల మంది పిల్లలు బడి మానేశారు..అత్యధికంగా ఏ రాష్ట్రంలో అంటే.?

11 లక్షల 70 వేల మంది పిల్లలు బడి మానేశారు..అత్యధికంగా ఏ రాష్ట్రంలో అంటే.?

దేశ వ్యాప్తంగా 2024- 25  విద్యాసంవత్సరానికి గానూ 11లక్షల 70 వేల మంది స్కూల్ మానేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోక్ సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు  కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి లిఖితపూర్వక  సమాదానం ఇచ్చారు.  మొత్తం 11లక్షల 70వేల 404 మంది పిల్లలు బడి మానేసినట్లు మంత్రి చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఖ్య ఎక్కువగా ఉందని తెలిపారు.    

ALSO READ | EVMలు మాకొద్దు .. గ్రామస్తుల తీర్మానం.. రాష్ట్రంలో రెండో గ్రామం

బడి బయట ఉన్న విద్యార్థుల్లో అత్యధికంగా  ఉత్తరప్రదేశ్‌లో 7.84 లక్షల మంది విద్యార్థులు, తర్వాతి స్థానాల్లో జార్ఖండ్ 65 వేల మంది, అస్సాం లో 63వేల మంది ఉన్నారని తెలిపారు. అతి తక్కువ సంఖ్యలో అండమాన్ నికోబార్ దీవులులో కేవలం ఇద్దరు, పుదుచ్ఛేరిలో నలుగురు  మాత్రమే బడి మానేశారని చెప్పారు. సిక్కీంలో 74 మంది,  లడఖ్ , లక్షద్వీప్‌లతో సహా కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్కరు కూడా డ్రాప్ ఔట్ కాలేదన్నారు

కేంద్ర విద్యాశాఖ నిర్వహించే(UDISE) పోర్టల్ ప్రకారం

ఏ రాష్ట్రంలో ఎంత మంది డ్రాప్ ఔట్
ఉత్తరప్రదేశ్: 7,84,228
జార్ఖండ్: 65,070
అస్సాం: 63,848
సిక్కిం: 74
పుదుచ్చేరి: 4
అండమాన్  నికోబార్ దీవులు: 2
లడఖ్: 0
లక్షద్వీప్: 0