మా రాష్ట్రంలో 12 లక్షల మంది బంగ్లా దేశీయులు ఉన్నారు: శ్రీరామ్ సేన చీఫ్

మా రాష్ట్రంలో 12 లక్షల మంది బంగ్లా దేశీయులు ఉన్నారు: శ్రీరామ్ సేన చీఫ్

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో తమ రాష్ట్రంలో అక్రమంగా ఉంటున్న ఆ దేశ పౌరుల సంగతేంటని శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ కర్ణాటక ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12 లక్షల మందికి పైగా బంగ్లాదేశ్ వలసదారులు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. వారంతా భారత పౌరులమని చూపించుకోవడానికి అవసరమైన తగు ప్రభుత్వ పత్రాలు పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

ఆధార్ కార్డులు తీసుకుంటున్నరు

"హసన్‌లో ఉంటున్న కొందరు బంగ్లాదేశ్ వలసదారులు అక్రమంగా ఆధార్ కార్డులు పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. వీరనే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఉంటున్న ఇలాంటి వారందరూ భారత పౌరసత్వం కోసం పత్రాలు పొందడానికి ఆయా బస్టాండ్‌లలో క్యాంప్ చేస్తున్నారు. వీరు ఉండటానికి, తిండికి డోకా లేదు. అదే బంగ్లాదేశ్‌లో ఉంటున్న హిందువులు దాడులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 

Also Read :- రష్యాలో ఘోర విమానం ప్రమాదం

"ఈ అకృత్యాలపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మౌనం వహించడం ఆమోదయోగ్యం కాదు. పొరుగు దేశంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని కేవలం ప్రకటనలు చేయడం సరి కాదు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆశ్రయం కల్పించడంతోనే హిందువులు హింసను ఎదుర్కొంటున్నారు. దీనిపై తక్షణమే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి.." అని శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ కర్ణాటక ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

ఈ విషయమై రాష్ట్ర హోంమంత్రికి నివేదిక అందజేసి వలసదారులను తమ దేశానికి పంపించాలని కోరతామని, లేనిపక్షంలో తమ సంస్థ చర్యలు తీసుకుంటుందని శ్రీరామ్ సేన చీఫ్ అన్నారు.