ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను ఆన్ లైన్ ఎంట్రీ చేసే కార్యక్రమం కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తుల కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. అభయహస్తం కింద దరఖాస్తులను ప్రభుత్వం ప్రజల నుంచి స్వీకరించింది. శనివారంతో(జనవరి 06) ప్రజాపాలన దరఖాస్తుల సమయం ముగిసింది. చివరి రోజు 16,90,278 దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వం వెల్లడించింది.
ప్రజాపాలన దరఖాస్తులు 1.25 కోట్లకు చేరుకుందని ప్రకటించింది. గ్రేటర్ వ్యాప్తంగా 24 లక్షల 74 వేల 325 అప్లికేషన్స్ వచ్చాయి. 30 సర్కిల్స్ లో అప్లికేషన్స్ ఎంట్రీ కార్యక్రమం జరుగుతోంది. 3 వేల 500 మంది డేటా ఆపరేటర్లతో ఆన్ లైన్ నమోదు ప్రక్రియను కొనసాగిస్తున్నారు. జనవరి 17 వరకు డేటా ఎంట్రీకి ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. దరఖాస్తులన్నీ ఆన్ లైన్ చేసిన తర్వాత లబ్ధిదారులను సమాచారం ఇస్తామంటున్నారు అధికారులు.