Thangalaan: మరో 141 థియేటర్స్లో తంగలాన్ మూవీ..తెలుగు రాష్ట్రాలలో తగ్గని విక్రమ్ హవా

చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) హీరోగా విభిన్న చిత్రాల దర్శకుడు పా.రంజిత్‌ (Pa Ranjith) దర్శకత్వంలో తెరకెక్కిన తంగలాన్‌ (Thangalaan) సినిమా విజయవంతంగా థియేటర్లలలో కొనసాగుతోంది. కర్ణాటకలోని కోలార్ గోల్డ్‌ ఫీల్డ్స్‌ కార్మికుల జీవితాల ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో విక్రమ్‌ గిరిజన తెగ నాయకుడి పాత్రలో కనిపించాడు.

కథ, క్యారెక్టర్, లుక్స్ పరంగా విభిన్న పాత్రలో విక్రమ్ కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక రోజురోజుకూ చియాన్ విక్రమ్ పెర్ఫార్మెన్స్ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తంగలాన్‌ సినిమాకు థియేటర్స్ పెంచారు మేకర్స్. రిలీజైన ఫస్ట్ వీక్ కంటే రెండో వారానికి ఏకంగా 141 థియేటర్స్ పెరిగాయని మేకర్స్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. దీనిని బట్టి తెలుగు రాష్ట్రాలలో తంగలాన్ సినిమాకి పెరుగుతోన్న ఆదరణ ఈ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవొచ్చు. కాగా, మొదటి వారం తంగలాన్ మూవీ 251 థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది.ఇక ఇప్పుడు 141 థియేటర్స్ యాడ్ చేయడంతో రెండో వారం నాటికి ఆ సంఖ్య 391కి పెరిగింది. దీంతో ఈ సినిమా కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. 

తంగలాన్ మూవీ ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజైన విషయం తెలిసిందే. అదే రోజు తెలుగులో రెండు బడా సినిమాలు, హిందీలో మూడు సినిమాలు రిలీజైనా..తమిళంలో మాత్రం ఈ సినిమాకు పోటీ ఇచ్చే సినిమా లేకపోయింది. ఇది కూడా తంగలాన్ కు కలిసి వచ్చింది. దీంతో ఈ మూవీకి రానున్న రోజుల్లో మరిన్ని కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది.