76 ఫ్లైట్లలో ఇండియాకు చేరిన 15,920 మంది

76 ఫ్లైట్లలో ఇండియాకు చేరిన 15,920 మంది

ఉక్రెయిన్ యుద్ధ కల్లోలంలో చిక్కుకున్న భారత విద్యార్థులు, పౌరులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగ’ చేపడుతోంది. ఆ దేశంలోని వేర్వేరు సిటీల్లో ఉన్న వారు సరిహద్దులకు చేరుకుంటే.. అక్కడి నుంచి పొరుగు దేశాల్లోని ఎయిర్ పోర్టుల ద్వారా భారత్ కు తీసుకొస్తోంది. ఈ ఆపరేషన్ లో భాగంగా ఇప్పటి వరకు 76 విమానాల్లో 15,920 మందిని ఇండియాకు తీసుకొచ్చినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఉక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి ఎన్నెన్ని ఫ్లైట్లలో ఎంత మందిని భారత్ కు తీసుకొచ్చామన్నది వివరిస్తూ ఆయన ట్వీట్ చేశారు. రొమేనియా నుంచి 31 ఫ్లైట్లలో 6,680 మందిని, పోలాండ్ నుంచి 13 ఫ్లైట్స్ లో 2,822 మందిని, హంగేరి నుంచి 26 ఫ్లైట్స్ లో 5,300 మందిని, స్లొవేకియా నుంచి 6 విమానాల్లో 1,118 మందిని ఇండియాకు చేర్చామని ఆయన పేర్కొన్నారు.

కాగా, ఉక్రెయిన్ లో ఇంకా చిక్కుకుని ఉన్న వారిని వేగంగా స్వదేశానికి తరలించేందుకు ఇవాళ భారత ప్రభుత్వం తాజాగా మరోసారి అలెర్ట్ ఇష్యూ చేసింది. తక్షణం అక్కడ ఉన్న ఇండియన్స్ అంతా వారి వివరాలతో ఒక గూగుల్ నింపాలని సూచిస్తూ ఉక్రెయిన్ లోని ఇండియన్ ఎంబసీ ట్వీట్ చేసింది. ఉక్రెయిన్ లో ఉన్నవ్యక్తి పేరు, వయసు, మెయిల్ ఐడీ, పాస్ పోర్ట్ నంబర్, ఉక్రెయిన్ లో వారు ఉన్న సిటీ పేరు, ప్రస్తుతం ఉన్న లొకేషన్, ఉక్రెయిన్ లో వాడుతున్న ఫోన్ నంబర్, ఇండియాలో వారికి సంబంధించిన వ్యక్తి ఫోన్ నంబర్, ఇంకా ఆ వ్యక్తితో ఒకే చోట ఎక్కువ మంది ఉంటే వారి సంఖ్యను గూగుల్ ఫామ్ లో పొందుపరచాలని పేర్కొంది. ఈ వివరాల ఆధారంగా వారిని గుర్తించి స్వదేశానికి తీసుకురానున్నట్లు ఎంబసీ తెలిపింది.

మరిన్ని వార్తల కోసం..

ఉక్రెయిన్‌లో బుల్లెట్ గాయాలైన విద్యార్థి రేపు భారత్‌కు

కేటీఆర్ రాజీనామా వ్యాఖ్యలపై షర్మిల కౌంటర్

మెస్‌లో కాల్పులు.. ఐదుగురు బీఎస్ఎఫ్ జవాన్ల మృతి