త‌మిళ‌నాడులో ఒక్క రోజే క‌రోనాతో 30 మంది మృతి

త‌మిళ‌నాడులో ఒక్క రోజే క‌రోనాతో 30 మంది మృతి

త‌మిళ‌నాడులో క‌రోనా వైర‌స్ వ్యాప్తి రోజు రోజుకీ పెరుగుతోంది. ప్ర‌తి రోజూ పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాల సంఖ్య భారీగా న‌మోద‌వుతోంది. శ‌నివారం ఒక్క రోజే 1,989 కరోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 30 మంది ప్రాణాలు కోల్పోయారు. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితిపై త‌మిళ‌నాడు ఆరోగ్య శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. ఈ ఒక్క రోజులో తమిళనాడులో కొత్త‌గా 1989 మంది క‌రోనా సోక‌గా.. అందులో 1,956 మంది లోక‌ల్స్, 33 మంది విదేశాలు, ఇత‌ర రాష్ట్రాల నుంచి తిరిగి వ‌చ్చిన వారు ఉన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 42,687కు చేరింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 1362 మంది క‌రోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాను జ‌యించిన వారి సంఖ్య 23,409కి చేరింది. అయితే శ‌నివారం ఒక్క రోజే భారీగా 30 మంది క‌రోనా చికిత్ప పొందుతూ ప్రాణాలు కోల్పోవ‌డం క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది. రాష్ట్రంలో కొత్త‌గా న‌మోదైన మ‌ర‌ణాల‌తో కలిపి మొత్తం క‌రోనా మృతుల సంఖ్య 397కి పెరిగింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలోని వేర్వేరు ఆస్ప‌త్రుల్లో 18,878 మంది చికిత్స పొందుతున్నారు.