ఎయిర్ పోర్టులో రెండు కిలోల బంగారం దొరికింది

బంగారం అక్రమ రవాణాకు ఎయిర్ పోర్టులు అడ్డాగా మారుతున్నాయి.  దేశ విదేశాల నుంచి విచ్చలవిడిగా బంగారాన్ని  రవాణా చేస్తున్నారు.సెప్టెంబర్ 20న  కొచ్చి ఎయిర్ పోర్టులో  రెండు వేర్వేరు ఘటనల్లో రెండు కిలోల బంగారాన్ని   కస్టమ్ అధికారులు సీజ్ చేశారు. 

ఒక ఘటనలో  మలేషియాలోని కౌలాలంపూర్ నుండి విమానాశ్రయంలో దిగిన మలప్పురానికి చెందిన స్వాదిక్‌ను తనిఖీ చేశారు అధికారు.  అతడి పురీష నాళం లో దాచిన  నాలుగు బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు.  ఇది 1.092 కిలోలు ఉంటుందని..దీని విలువు రూ.48 లక్షలని అధికారులు తెలిపారు.

ALSO READ : చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ పాదయాత్ర.. ప్రజాకోర్టుకు తీసుకెళ్తామన్న బాలకృష్ణ

మరో సంఘటనలో కస్టమ్స్ అధికారులు మరొక ప్రయాణికుడిని తనిఖీ చేయగా.. మూడు స్థూపాకార  క్యాప్సూల్స్ అతని పురీషనాళంలో దాచిపెట్టాడు.  సుమారు 1066.43 గ్రాముల బంగారాన్ని సీజ్ చేసిన అధికారులు  దీని విలువ 50 లక్షల రూపాయల విలువ ఉంటుందని తెలిపారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి  దర్యాప్తు జరుపుతున్నట్లు కస్టమ్స్  అధికారులు తెలిపారు..