ఉక్రెయిన్, రష్యా యుద్దం..సుమీ నగరంపై మిస్సైల్ దాడి..21మంది మృతి

ఉక్రెయిన్, రష్యా యుద్దం..సుమీ నగరంపై మిస్సైల్ దాడి..21మంది మృతి

ఉక్రెయిన్ పై రష్యా మిస్సైల్స్ తో విరుచుకుపడింది.ఆదివారం ( ఏప్రిల్13) ఉదయం ఉక్రెయిన్ లోని సుమీ నగరంపై రష్యా జరిపిన మిస్సైల్ దాడిలో 21మంది చనిపోయారు.34 మంది గాయపడ్డారు. పామ్ సండే సందర్భంగా పెద్ద ఎత్తున గుమికూడిన జనంపై  రష్యా రెండు మిస్సైల్స్ తో దాడి చేసిందని ఉక్రెయిన్ జనరల్ ప్రాసిక్యూటర్ కార్యాలయం ప్రకటించింది. 

ఆదివారం ఉదయం 10:15 గంటలకు పామ్ సండే జరుపుకోవడానికి గుమికూడిన ప్రజలపై రెండు బాలిస్టిక్ క్షిపణులు సుమీ నగరం మధ్యలోకి దూసుకెళ్లాయని అధికారులు తెలిపారు. సంఘటన స్థలం నుండి అధికారిక ఛానెల్‌లలో షేర్ చేయబడిన వీడియోలు నగరం మధ్య ప్రాంతాలలో శిధిలాలు ,పొగ మధ్య మృతదేహాలు పడి ఉన్నట్లు చూపించాయి.

►ALSO READ | Sudan: సుడాన్లో దారుణం..కరువు పీడిత శిబిరాలపై దాడులు..కుప్పలుగా శవాలు

శనివారం తెల్లవారుజామున ఉక్రెయిన్‌లోని కైవ్‌లోని ఇండియాకు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ గిడ్డంగిపై  రష్యా క్షిపణి దాడులు జరిగిన విషయం తెలిసిందే. భారత్ లోని  ఆ దేశ రాయబార కార్యాలయం ధృవీకరించింది. భారత్ తో ప్రత్యేక స్నేహం అంటూనే రష్యా ఉక్రెయిన్‌లోని భారతీయ వ్యాపారాలను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంటుందని ఆరోపించింది. 

ధ్వంసమైన గోడౌన్ ఉక్రెయిన్‌లోని అతిపెద్ద ఫార్మా కంపెనీలలో ఒకటైన కుసుమ్ అనే ఫార్మాస్యూటికల్ కంపెనీకి చెందినది.కుసుమ్ హెల్త్‌కేర్ మానవతా ప్రయోజనాల కోసం ఉపయోగించే అవసరమైన వైద్య సామాగ్రిని నిల్వ చేసింది. ఈ కంపెనీ భారతీయ వ్యాపారవేత్త రాజీవ్ గుప్తా యాజమాన్యంలో ఉంది.