Child marriages UN report: బాల్య వివాహాలు..మూడింట ఒకవంతు మన దేశంలోనే..

Child marriages UN report: బాల్య వివాహాలు..మూడింట ఒకవంతు మన దేశంలోనే..

ప్రపంచంలోని చాలా దేశాల్లో బాల్యవివాహాలు ఒక బలమైన ఆచారంగా సాగుతోంది. ప్రపంచం వేగంగా అభివృద్ది చెందుతూ టెక్ యుగం సాగుతున్న ఈ సమయంలో కూడా కొన్ని ప్రాంతాలు దానికి అనుగుణంగా ముందుకు సాగడం లేదు. విచారకరమైన విషయం ఏంటంటే బాల్య వివాహాలు అనర్థాలకు దారి తీస్తుందని తెలిసినా పట్టించుకోకపోవడం. బాల్య వివాహం అనేది 18 ఏళ్లు వారికి వారి సమ్మతి లేకుండా చేసే అధికారిక లేదా అనధికారిక వివాహం. చాలా సందర్భాల్లో అబ్బాయి ..అమ్మాయి కంటే చాలా పెద్దవాడు.. ఇదొక సామాజిక దురాచారం అయినప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది. 

బాల్య వివాహాలు..టెక్ యుగంలో కూడా జరుగుతున్నాయా..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాల్య వివాహాలను అడ్డుకోడానికి ఎన్నో చట్టాలు తెచ్చాయి. చిన్నతనంలో పెళ్లిళ్లు జరగకుండా అడ్డుకునేందుకు చాలా స్థాయిల్లో అధికారులను కూడా నియమించాయి.బాల్యవివాహాలతో చాలా అనర్ధాలున్నాయని.. సమాజంలో ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా  బాల్య వివాహాలు ఎందుకు ఆగడంలేదు..సామాజిక, ఆరోగ్యపరమైన సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తున్నా ఎందుకు ఫలితం లేకుండా పోతోంది. ప్రపంచంతో పాటు దేశంలో కూడా  బాలవివాహాలు గణనీయంగా పెరిగాయట.. 

దేశంలో 200 మిలియన్లకు పైగా మహిళలు తమ చిన్న తనంలో పెళ్లిళ్లు చేసుకున్నారని ఐక్యరాజ్యసమితి రిపోర్టులు చెబుతున్నాయి.  ప్రపంచ వ్యాప్తంగా 640 మిలియన్ల మంది బాలికలు, మహిళలు 18 ఏళ్లు నిండకముందే పెళ్లి చేసుకున్నారట. వీటిలో మూడింట ఒకవంతు కేసులు భారత్ లోనే జరుగుతున్నాయని సస్టైనబుల్ డెవలప్ మెంట్ గోల్స్ రిపోర్ట్ 2024 చెబుతోంది. 

ఈ రిపోర్టు ప్రకారం.. 25 యేళ్ల క్రితం 18 ఏళ్లలోపు పెళ్లైన ప్రతి ఐదుగురిలో ఒకరు బాల్య వివాహం చేసుకున్నవారేనట. అయితే ఈ 25 యేళల్లో 68 మిలియన్ల బాల్య వివాహాలను అడ్డుకున్నట్లు ఐక్యరాజ్య సమితి చెపుతోంది. 

మరోవైపు ప్రపంచ జీవన పరిస్థితులను మెరుగు పర్చేందుకు యూఎన్ నిర్దేశించిన 169 లక్ష్యాలలో కేవలం 17 శాతం మాత్రమే 2030 నాటికి పూర్తి కాగలవని రిపోర్టు చెబుతోంది. 2015లో ప్రపంచ నేతలు ఆమోదించిన ఈ లక్ష్యాలు పేదరికం అంతం చేయడం నుంచి లింగ వివక్ష సమానత్వాన్ని సాధించడం వరకు అనేక రకాల సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయినప్పటికీ ఈ లక్ష్యాలలో దాదాపు సగం కనిస్ట లేదా మధ్యస్థ పురోగతిని చూపాయి. మూడింట ఒక వంతుకు పైగా నిలిచిపోయాయి.