
అమెరికాలో అక్రమ వలదారుల ఏరివేత కొనసాగుతోంది. ఎటువంటి ధృవపత్రాలు లేకుండా అమెరికాలో నివాసముంటున్న విదేశీయులను అమెరికా ప్రభుత్వం వెతికిపట్టుకొని అరెస్ట్ చేస్తోంది. వారిని సొంత దేశాలకు పంపించేస్తుంది.
ట్రంప్ అమెరికా అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టనప్పటినుంచి వలసదారులపై అణచివేత కొనసాగుతోంది. వలసదారులపై కఠిన ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో ట్రంప్ నెలరోజు పాలనలో దాదాపు 20వేల మంది వలసదారులను అరెస్టు చేసినట్లు అమెరికా ప్రభుత్వం వెల్లడించింది.
Also Read :- మస్క్‌ను చిన్న మాట అన్నా పీకి పడేస్తా
వలసదారులను అరెస్ట్ చేయడం బైడెన్ ప్రభుత్వాన్ని మించిపోయింది ట్రంప్ ప్రభుత్వం.. గతేడాది బైడెన్ ప్రభుత్వం 33వేల మంది వలసదారులను అరెస్ట్ చేయగా.. ట్రంప్ ఒక నెలలోనే 20వేల మందిని అదుపులోకి తీసుకున్నారు.
అయితే వలసదారులను అరెస్టులపై అమెరికాలో సీనియర్ అధికారులనుంచి నిరసన వ్యక్తం అవుతున్నాయి. ఫలితంగా ICE యాక్టింగ్ డైరెక్టర్ కాలేబ్ విటెల్లోను ట్రంప్ తొలగించారు. బహిష్కరణలపై తాను అసంతృప్తిగా ఉన్నానని బహిరంగంగా ప్రకటించారు విటెల్లా.
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులు ఫెడరల్ ప్రభుత్వంలో నమోదు చేసుకోకపోతే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. జరిమానాలు, జైలు శిక్ష లేదా రెండూ విధించే అవకాశం ఉందని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది.
US పౌరసత్వం ,ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ వెబ్‌సైట్ ప్రకారం..US వీసా కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు వేలిముద్రలు తీసుకోని లేదా నమోదు చేసుకోనివారు, 30 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం USలో ఉన్న 14 ఏళ్లు పైబడిన వలసదారులందరూ తప్పసరిగా నమోదు చేసుకోవాలి,వేలిముద్రలు తీసుకోవాలి, వలసదారులుగా నమోదు చేసుకోవచ్చని ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది.