ఇండోనేషియాలో భారీ అగ్ని పర్వత విస్ఫోటనాలు..సునామీ వస్తుందా?

జకార్తా: ఇండోనేషియాలో అగ్నిపర్వతం విస్ఫోటనాలు అక్కడి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో రాళ్లు పడిపోవడం, బూడిద, వేడి అగ్ని పర్వత మేఘాలు కమ్ముకోవడంతో వేలాది మంది అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇండోనేషియాలోని అగ్నిపర్వత , జియోలాజికల్ హాజార్డ్ మిటిగేషన్ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం..శుక్రవారం (ఏప్రిల్ 18) మూడు భారీ అగ్ని పర్వత విస్ఫోటనాలు నమోదు అయ్యాయి. విస్ఫోట కాలమ్ గరిష్ట ఎత్తు 1200 మీటర్లకు చేరుకుంది. 

మౌంట్ రువాంగ్ నుంచి భారీ అగ్ని పర్వత విస్ఫోటనాలు సంభవించాయి. ఈ విస్ఫోటనాలతో అగ్ని పర్వతానికి 100 కిమీ దూరంలో ఉన్న మనాడో నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. విస్ఫోటనానికి సంబంధించిన బూడిద పశ్చిమ, వాయువ్యం, ఈశాన్యం , ఆగ్నేయ ప్రాంతాలకు వ్యాపించిందని, మనాడో, ఉత్తర మినహాసాను  కవర్ చేసినట్లు ఇండోనేషియా రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది.

 ALSO READ : ఇజ్రాయిల్‌కు ఇరాన్ వార్నింగ్.. మీరే అని తెలిస్తే ఊరుకోం

సునామి ముప్పు ఇండోనేషియాలోని ఇళ్లు, రోడ్లు అగ్నిపర్వత బూడిదతో కప్పబడ్డాయి. విస్ఫోటనంలో వెలువడిన శిథిలాల వల్ల అనేక ఇళ్ల పైకప్పులు విరిగిపోయాయి. 1871లో సంభవించిన విస్ఫోటనంలో అగ్నిపర్వతంలోని కొంత భాగం సముద్రంలో కూలిపోయి సునామిని దారితీసింది. ఇప్పుడు కూడా ఇదే విధంగా సునామికి దారితీయొచ్చని అధికారులు ఆంధోళన చెందుతున్నారు. గత బుధవారం ఐదు విస్ఫోటనాలు సంభవించాయి. దీని కారణంగా అగ్ని పర్వాతా కేంద్రం సునామి హెచ్చరికలు జారీ చేసింది.