
వనపర్తి/మదనాపూరు, వెలుగు : జిల్లాలో ఇప్పటి వరకూ సుమారు 23వేల కోళ్లకు పైగా చనిపోయినట్టు వెటర్నరీ అధికారులు తెలిపారు. శుక్రవారం జిల్లా వెటర్నరీ ఆఫీసర్ వెంకటేశ్వరరెడ్డి, ఎనిమల్ డిసీజ్డ్ అండ్ డయాగ్నసిస్ ల్యాబ్ ఆఫీసర్ కరుణశ్రీ ఆత్మకూర్ మండలంలోని పిన్నం చర్ల గ్రామాన్ని సందర్శించారు. అక్కడ ఓ ఫౌల్ట్రీలో ఆరు వేల కోళ్లు చనిపోయాయి. వాటి శాంపిళ్లు సేకరించి, పూడ్చేయించారు.
అనంతరం అధికారులు మాట్లాడుతూ.. మదనాపూర్ మండలం కొన్నూర్లో 5540 కోళ్లు, చిన్న చింత కుంట మండలంలోని రెండు ఫౌల్ట్రీల్లో 15రోజుల క్రితం 12 వేల కోళ్లు చనిపోయినట్టు తెలిపారు. ఎక్కడైనా కోళ్లు చనిపోతే బయటపారేయొద్దని, పూడ్చిపెట్టాలని చెప్పారు.
పిన్నంచెర్ల చనిపోయిన కోళ్లను బహిరంగ ప్రదేశాల్లో పడేశారని తెలిపారు. అనంతరం ఆత్మకూరు, పిన్నంచెర్ల, కొన్నూరు, నెల్వడి, నర్సింగాయపల్లి, కొన్నూరుతండా తదితర ప్రాంతాల్లో చికెన్అమ్మొద్దని ఆదేశించారు. ల్యాబరేటరీ నుంచి రిపోర్ట్ వచ్చాకే కోళ్లకు వచ్చిన వ్యాధి ఏంటో తెలుస్తుందని చెప్పారు.