మనదేశంలో 28 లక్షల కంపెనీలు రిజిస్టర్

మనదేశంలో 28 లక్షల కంపెనీలు రిజిస్టర్
  • యాక్టివ్​గా 65 శాతం సంస్థలు

న్యూఢిల్లీ: మనదేశంలో 28 లక్షలకుపైగా కంపెనీలు రిజిస్టర్​ అయ్యాయని, వీటిలో 65 శాతం యాక్టివ్​గా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. ఇందులో 5,216 విదేశీ సంస్థలు కంపెనీల చట్టం 2013 ప్రకారం రిజిస్టర్​కాగా, 3,281 యాక్టివ్​గా ఉన్నాయి. మొత్తం 16,781 కంపెనీల పెయిడ్ అప్​ క్యాపిటల్ ​విలువ గత నెల నాటికి రూ.816.14 కోట్లని కేంద్ర కార్పొరేట్​వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దాదాపు 9,49,934 కంపెనీలు మూతబడ్డాయి. 

యాక్టివ్‌‌ కంపెనీల్లో 27 శాతం కంపెనీలు బిజినెస్ సర్వీసెస్​ రంగంలో, 20 శాతం మాన్యుఫాక్చరింగ్​ సెక్టార్‌‌‌‌లో, 13 శాతం ట్రేడింగ్​, పర్సనల్​, సోషల్​ సర్వీసుల రంగంలో ఉన్నాయి. అత్యధిక యాక్టివ్​ కంపెనీల జాబితాలో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉండగా, ఢిల్లీ, యూపీ, పశ్చిమ బెంగాల్​ తరువాతి స్థానాల్లో ఉన్నాయి.