
ఒక ఏడాది రెండేండ్లు నర్సరీ చదివాక మీ పిల్లలు మళ్లీ యూకేజీ చదవాలని స్కూ్ల్స్ చెబితే ఎలా ఉంటది. సంవ్సరానికి బోలెడె ఫీజులు కట్టీ నర్సరీ పూర్తి చేయిస్తే.. 1వ తరగతి చదవడానికి లేదు.. మళ్లీ UKG లోనే కూర్చోవాలంటే పేరెంట్స్ పరిస్థితి ఏంటి..? ఇప్పుడు బెంగళూరులో ఇదే జరుగుతోంది. చెప్పాల్సిన విషయం పేరెంట్స్ కు చెప్పకుండా నిబంధనలు దాచి.. ఒకటి రెండేళ్లు ఫీజులు వసూలు చేసి చివరికి మీ పిల్లలను యూకేజీలోనే కూర్చోబెడతామని చెపుతుండటంతో బెంగళూరులో వివాదాస్పదం అవుతోంది.
ఈసారి జూన్ లో ఫస్ట్ క్లా్స్ చదవాల్సిన దాదాపు 400 మంది స్టూడెంట్స్ మళ్లీ యూకేజీ చదవాలనే నిబంధనకు బలికావాల్సి వస్తోంది. దీనికి కారణం 1వ తరగతికి కనీస వయసు 6 ఏండ్లు అని పేరెంట్స్ కు ప్రైవేట్ స్కూల్స్ చెప్పకపోవడమే. పిల్లల్ని జాయిన్ చేసుకునే ముందు కనీస వయసు 6 ఏండ్లు అనే నిబంధన చెప్పకుండా ఫీజులు వసూలు చేశారని, దీనివలన తీవ్రంగా నష్టపోతున్నామని పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు.
స్కూల్ లో పిల్లలను జాయిన్ చేసుకునేటప్పుడే నిబంధనలు చెబితే ఏ సమస్య రాదు. కానీ విషయం చెప్పకపోగా.. నిబంధనలు తెలుసుకోవాలని, అది ప్రభుత్వ నిబంధన తామేం చేస్తామని తిరిగి తల్లిదండ్రులను బెదిరిస్తున్నాయి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు. ఫీజుల కోసం కక్కుర్తి పడి ముందుగా పిల్లలను చేర్చుకున్నారని, కానీ ఇప్పుడు రూల్స్ మాట్లాడుతున్నారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ విషయంపై విద్యా శాఖ కూడా కల్పించుకునేందుకు నిరాకరించింది. ఎలాగో యూకేజీ పూర్తి చేశారు కదా.. 1వ తరగతికి ప్రమోట్ చేసేందుకు అవకాశం కల్పించాలనే తల్లిదండ్రుల రిక్వెస్ట్ ను విద్యాశాఖ తోసిపుచ్చింది. దీంతో 400 మంది విద్యార్థులు మళ్లీ యూకేజీ చదవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే ఏడాదికి రూ.లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు ఫీజులు చెల్లించారు పేరెంట్స్. పేరెంట్స్ కు ఆర్థికంగా ఇది తీవ్ర నష్టం కలిగించనుంది.
ALSO READ : మగాళ్ల గురించి కాస్త ఆలోచించండని చెప్పి.. టీసీఎస్ మేనేజర్ ఆత్మహత్య..
2022, నవంబర్ 15 న 1వ తరగతి చదివేందుకు విద్యార్థుల కనీస వయసు 6 ఏండ్లు ఉండాల్సిందేనని కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2025, జూన్ 1 నాటికి 6 ఏండ్లు పూర్తైన వారినే 2025-26 అకడమిక్ ఇయర్ కు జాయిన్ చేసుకోవాలని విద్యాశాఖ సర్క్యూలర్ జారీ చేసింది. అయితే 21 స్కూల్స్ లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్స్ వ్యవహరించిన విధానంపై ఫిర్యాదు చేస్తు్న్నారు. అడ్మిషన్ తీసుకున్నపుడు ఈ విషయం చెప్పి ఉంటే ఫీజు భారం తగ్గేదని, కానీ ఇప్పుడు మళ్లీ పిల్లలను యూకేజీలోనే చదివించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో కూడా జూన్ లో అడ్మిషన్స్ ఉన్నందును పేరెంట్స్ ఈ విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. జాతీయ విద్యావిధానంలో భాగంగా 1వ తరగతికి కనీస వయసును 6 సంవత్సరాలుగా కేంద్రం నిర్ణయించింది. అన్ని రాష్ట్రాలు 1వ తరగతికి కనీస వయసు 6 ఏండ్లు ఉండేలా నిబంధనలు అమలు చేయాలని 2023 ఫిబ్రవరిలో సూచించింది కేంద్రం. విద్యార్థులను నర్సరీలో జాయిన్ చేసే ముందు ఈ విషయంపై క్లారిటీ తీసుకుని జాయిన్ చేయడం మంచిది. లేదంటే.. పిల్లలు మళ్లీ యూకేజీ చదవాల్సిన పరిస్థితి వస్తుంది. ఫీజులు కూడా డబల్ చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.