ఒకే రోజు 4 వేల మంది టీచర్లకు ఉద్యోగాలు

ఒకే రోజు 4 వేల మంది టీచర్లకు ఉద్యోగాలు

ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలనం నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ విద్యపై దృష్టి పెట్టింది. పాఠశాలల్లో మౌలిక వసతులతోపాటు.. పిల్లలకు మెరుగైన. నాణ్యమైన విద్య అందించేందుకు పెద్ద ఎత్తున ఉపాధ్యాయుల నియామకం చేపట్టింది. ఆ ప్రభుత్వం ఏదో కాదు.. ఒడిశా.. సీఎం నవీన్ పట్నాయక్ ఆధ్వర్యంలో.. తన చేతుల మీదుగా.. ఒకే రోజు.. 4 వేల 166 మందికి టీచర్లుగా అపాయింట్ ఇచ్చారు..  నిజుక్తి పర్బా పేరుతో.. నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. సీఎం నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ.. నేటి పిల్లలను.. రేపటి పౌరులుగా తీర్చిదిద్దటంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం అని.. ప్రభుత్వ పాఠశాల్లో పిల్లలకు మంచి విద్య అందించే లక్ష్యంతో.. 4 వేల మంది ఉపాధ్యాయులను నియమించటం జరిగిందన్నారు. టీచర్ పాత్రలోకి వస్తున్న వారు.. రాష్ట్ర, దేశ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని.. పిల్లలకు మంచి విద్య అందించాలని సూచించారు.

ఫ్లాగ్‌షిప్ 5T (ట్రాన్స్‌ఫార్మేషనల్ ఇనిషియేటివ్) పథకం కింద.. ఒడిశా రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల 883 ఉన్నత పాఠశాల్లో మౌలిక వసతులు, టీచర్ల నియామకం చేపట్టనుంది అక్కడి ప్రభుత్వం. పిల్లలకు మంచి క్లాస్ రూం వాతావరణంతోపాటు.. టాయిలెట్ల సౌకర్యం.. స్కూల్ ఆవరణలో ఆహ్లాదకర వాతావరం ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో కోసం 138 కోట్ల రూపాయలతో..  ముఖ్యమంత్రి విద్యా అవార్డు పథకాన్ని ప్రకటించారు ఒడిశా సీఎం.  

ప్రభుత్వ స్కూల్స్ కాలేజీలను ప్రైవేట్, కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లేందుకు ఇటీవల కాలంలో.. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. అందులో ఇప్పటికే ఢిల్లీలో కేజ్రీవాల్, ఏపీలో సీఎం జగన్ ఈ దిశగా అద్భుతమైన పనితీరుతో ఆకట్టుకుంటున్నారు. ఇదే బాటలో ఇప్పుడు ఒడిశాలోని సీఎం నవీన్ పట్నాయక్.. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చుతున్నారు. ఇందులో భాగంగా.. ముందుగా.. ప్రభుత్వ స్కూల్స్ లో4 వేల 166 మంది టీచర్లను నియమించారు.