
గుజరాత్ లో అక్రమంగా ఉంటున్న 500 మందికి పైగా బంగ్లాదేశీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సూరత్‌లో ఏప్రిల్ 25న రాత్రిపూట నిర్వహించిన ఆపరేషన్‌లో 100 మందికి పైగా వ్యక్తులు పట్టుబడ్డారని అధికారులు తెలిపారు.
స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG), క్రైమ్ బ్రాంచ్, యాంటీ-హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) స్థానిక పోలీసు విభాగాల సహకారంతో గుజరాత్ పోలీసులు అహ్మదాబాద్‌లో తనిఖీలు చేశారు. తెల్లవారుజామున 450 మందికి పైగా అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా భారతదేశంలోకి ప్రవేశించారని.. నకిలీ పత్రాలను ఉపయోగించి దేశంలో నివసిస్తున్నట్లు అధికారులు తేల్చారు.
వారు చట్టవిరుద్ధంగా భారతదేశంలోకి ప్రవేశించారు. నకిలీ పత్రాలతో నివసిస్తున్నారు. దర్యాప్తు తర్వాత వాళ్లను బంగ్లాదేశ్‌కు పంపుతామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (SOG) రాజ్‌దీప్ సింగ్ నకుమ్ తెలిపారు.అహ్మదాబాద్‌లో ఏప్రిల్ 26న తెల్లవారుజామున 3 గంటలకు ఆపరేషన్ మొదలు పెట్టారు. చందోలా ప్రాంతంలో ఎలాంటి పత్రాలు లేని 400 మందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
పహల్గాంలో టెర్రరిస్టుల దాడి తర్వాత పాకిస్తాన్ పై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఉంటున్న పాకిస్తానీయులు ఎందరు ఉన్నారో తేల్చి వారిని తిరిగి పాకిస్తాన్ కు పంపాలని కేంద్రం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది . ఈ క్రమంలో భారత్ లో ఉంటున్న పాకిస్తాన్ వలసదారులను వెతికే పనిలో పడ్డాయి అన్ని రాష్ట్రాలు. ఈ క్రమంలో పోలీసులు గుజరాత్ లో పోలీసులు ఆపరేషన్ చేపట్టగా.. 500 మందికి పైగా అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీయులను గుర్తించారు.