- జమ్మూ కాశ్మీర్‌లో నేటి నుంచి ప్రవేశ పరీక్షలు
జమ్మూ: జమ్మూ కాశ్మీర్‌లో 4,002 పోలీసు కానిస్టేబుల్పోస్టులకు 5.59 లక్షల మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. ఆదివారం నుంచి ప్రవేశ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే, ఏజ్రిలాక్షేషన్, పరీక్షను రీషెడ్యూల్ చేయాలని కొందరు డిమాండ్చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. డిసెంబర్ 1, 8, 22 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయని జమ్మూ కాశ్మీర్ సర్వీసెస్ సెలక్షన్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఎస్‌ఎస్‌ఆర్‌బీ) చైర్‌పర్సన్ ఇందు కన్వాల్చిబ్ తెలిపారు.
మొత్తం 4,002 కానిస్టేబుల్పోస్టులకు 5,59,135 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారని వెల్లడించారు. కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్/ఆర్మ్‌డ్/ఎస్‌డీఆర్‌ఎఫ్) పోస్టులకు డిసెంబర్ 1న 20 జిల్లాల్లోని 856 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని.. వీటికి 2,62,863 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని చెప్పారు. అందులో కేవలం ఒక జమ్మూ జిల్లా నుంచే గరిష్టంగా 54,296 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని వెల్లడించారు.
అలాగే, కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్స్) పోస్టులకు 8న జరిగే పరీక్షలకు 1,67,609 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని, 22న జరిగే కానిస్టేబుల్ (ఫొటోగ్రాఫర్) పరీక్షలకు 1,28,663 మంది హాజరుకానున్నట్టు ఎస్‌ఎస్‌ఆర్‌బీ చైర్‌పర్సన్ తెలిపారు. కాగా, పలువురు కానిస్టేబుల్, సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టుల అభ్యర్థులు తమకు వయోపరిమితిలో సడలింపు ఇవ్వాలని, కానిస్టేబుల్ పరీక్షను రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం నిరసన వ్యక్తం చేశారు.