
రష్యా,ఉక్రెయిన్ ల మధ్య జరుగుతున్న యుద్ధం పదో రోజుకు చేరుకుంది. వేలాది మంది ఉక్రెయిన్ పౌరులు ఆయుధాలు చేతబట్టి మాతృదేశం కోసం యుద్ధంలో పోరాడుతున్నారు.మరోవైపు ఉక్రెయిన్ రక్షణ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్ కీలక ప్రకటన చేశారు. రష్యాపై పోరాడేందుకు 66,224 మంది ఉక్రెయిన్ జాతీయులు విదేశాల నుంచి తిరిగొచ్చారని అన్నారు. తమ మాతృభూమిని కాపాడుకోవడానికి ఉక్రెయిన్ పౌరులు ఎంతటి పోరాటానికైనా సిద్ధమని చెప్పడానికి ఇదొక నిదర్శనమన్నారు.మరోవైపు ఖార్ఖివ్ లో ఉన్న 298 మంది విద్యార్థులను తరలించేందుకు బస్సులను ఏర్పాటు చేశామని ఉక్రెయిన్ లోని ఇండియన్ ఎంబసీ తెలిపింది.
66224. That's how many men returned from abroad at this moment to defend their Country from the horde. These are 12 more combat and motivated brigades ??! Ukrainians, we are invincible! #FightLikeUkrainian
— Oleksii Reznikov (@oleksiireznikov) March 5, 2022
మరిన్ని వార్తల కోసం..