![ఏపీలో కర్రల సమరం.. 70మందికి తీవ్ర గాయాలు](https://static.v6velugu.com/uploads/2024/10/over-70-injured-in-andhra-pradesh-traditional-stick-fight-during-dussehra_E01FMXpqLO.jpg)
ఏపీలో దసరా ఉత్సవాల్లో హింస చెలరేగింది. కర్నూలు జిల్లా దేవరగట్టులో ప్రతి ఏటా దసరా సందర్బంగా బన్నీ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా కర్రల సమరం జరుగుతుంది. ప్రతి ఏడులాగే ఈ ఏడాది కూడా కర్రల సమరం జరిగింది. ఈ సమరంలో పలు గ్రామాల ప్రజలు మాళ మల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులను దక్కించుకునేందుకు కర్రలతో తలపడ్డారు.
అయితే.. ఆదివారం ( అక్టోబర్ 13, 2024 ) తెల్లవారుజామున జరిగిన కర్రల సమరం హింసకు దారి తీసింది. కర్రలతో ఇరువర్గాల జనం కొట్టుకోవడంతో 70 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.