మయన్మార్, థాయిలాండ్ భూకంపం: 700 దాటిన మృతుల సంఖ్య..

మయన్మార్, థాయిలాండ్ భూకంపం: 700 దాటిన మృతుల సంఖ్య..

మయన్మార్, థాయిలాండ్ లో శుక్రవారం భూకంపం కలకలం రేపిన సంగతి తెలిసిందే..ఈ భూవిలయంలో మృతుల సంఖ్య పెరుగుతోంది.రిక్టర్ స్కేల్ పై 7.7గా నమోదైన ఈ భూప్రకంపనల వల్ల మృతి చెందినవారి సంఖ్య 700 దాటినట్లు తెలుస్తోంది. మయన్మార్ లో 694 మంది మరణించినట్లు మిలిటరీ అధికారులు వెల్లడించగా.. బ్యాంకాక్ లో 10 మరణించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఓ భారీ భవంతి కూలి సుమారు 100 మంది కార్మికులు గల్లంతయ్యారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య 10వేలు దాటే ఛాన్స్ ఉందని.. అమెరికా ఏజెన్సీ హెచ్చరించింది.

భూకంపం ధాటికి మయన్మార్, బ్యాంకాక్ చిగురుటాకులా వణికిపోయాయి. చాలా బిల్డింగ్​లు పేక మేడల్లా కుప్పకూలిపోయాయి. జనమంతా భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. నిమిషాల వ్యవధిలోనే ఆరుసార్లు భూమి కంపించింది. మెయిన్ రోడ్లు, బ్రిడ్జీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆఫీసులు, షాపింగ్ మాల్స్ గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. ప్లాట్​ఫామ్​పై ఉన్న మెట్రో రైళ్లు ఊగిపోయాయి. మయన్మార్​లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్​పై అత్యధికంగా 7.7 నమోదుకాగా, అత్యల్పంగా 4.3గా రికార్డయింది. భూకంపం ధాటికి పెద్ద పెద్ద భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి.  పలుచోట్ల ఎత్తైన ఆలయాలు, గోపురాలు కుప్పకూలాయి.

ALSO READ | అఫ్గనిస్తాన్ లో భూకంపం...రిక్టర్‌ స్కేల్‌పై 4.7 తీవ్రత నమోదు

మండాలెలో ఇర్రవడ్డీ నదిపై ఉన్న అతి పురాతన అవా బ్రిడ్జి కూలిపోయింది. నేపిడాలోని వెయ్యి పడకల హాస్పిటల్ కుప్పకూలింది. ఇక్కడ భారీగా ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మయన్మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోని మోనివా నగరానికి తూర్పున 50 కిలో మీటర్ల దూరంలో 10 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వే గుర్తించింది. థాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నూ భూకంపం వణికించింది.

బ్యాంకాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 7.3 తీవ్రతతో రెండుసార్లు భూమి కంపించడంతో బిల్డింగ్​లు కుప్పకూలాయి. ప్రకంపనలకు ఏకంగా మెట్రో రైళ్లు కూడా ఊగిపోయాయి. బిల్డింగ్​లపై ఉన్న ఓపెన్ స్విమ్మింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూల్స్​లోని నీళ్లు కిందకు పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతున్నాయి. థాయ్​లాండ్ ప్రధాని షినవత్ర దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. అదేవిధంగా చైనాలోని యునాన్ ప్రావిన్స్, బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లావోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వియత్నాం, ఇండియాలోనూ భూమి కంపించింది.