బోట్ స్మార్ట్ వాచ్ లు, ఆడియో డివైస్ లు కొన్నారా.. అయితే మీ డేటా డార్క్ నెట్ లోకి వెళ్లినట్లే.. మీ మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ వంటి వివరాలు సైబర్ నేరగాళ్ల చేతుల్లో ఉన్నట్లే.. ShopifyGUY అని పిలువబడే హ్యాకర్ ద్వారా బోట్ కంపెనీకి చెందిన అన్ని రకాల ప్రాడక్ట్స్ కస్టమర్ల డేటాను దొంగలించారు. ఈ డేటాతో సైబర్ క్రైమ్స్, ఫిషింగ్ స్కామ్‌లకు గురవుతారు. boAt డెజర్ జోన్ లోనే ఉన్నారనే చెప్పాలి. దాదాపు 7.5 మిలిమన్ల(75 లక్షల) బోట్ వినియోగదారుల పర్సనల్ డేటా హ్యాకర్ల చేతిలో ఉందని ఫోర్బ్స్ ఇండియా నివేదికలు చెబుతున్నాయి.
బోఆట్ డేటా ఉల్లంఘనకు సంబంధించిన నివేదికలో కస్టమర్‌ల పేర్లు, చిరునామాలు, సంప్రదింపు నంబర్‌లు, ఇమెయిల్ IDలు, కస్టమర్ IDలు వంటి వ్యక్తిగత వివరాలు డార్క్‍వెబ్‌లో అమ్ముడవుతున్నాయని పేర్కొంది. ఇలా బోట్ ఇండియన్ కస్టమర్స్ డేటా లీక్ అవ్వడం ఇదేం మొదటిసారికాదు.గతంలో కూడా ఇలా జరిగింది. డార్క్ నెట్ అంటే ఇక్కడ అన్నీ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. మోస్ట్ టెక్నాలజీని వాడి హ్యాకర్స్ సైబర్ క్రైమ్స్ కు పాల్పడుతుంటారు. ఇక్కడ వ్యక్తుల పర్సనల్ డేటా కూడా విక్రయిస్తుంటారు. 75లక్షల మంది భారతీయులైన బోట్ యూజర్స్ డేటా ప్రస్తుతం ఈ డార్క్ నెట్ లో పెట్టారు.