మన ఇంట్లో వాడే స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్స్, USB లాంటి వాటికి ఛార్జింగ్ పెట్టాలంటే కొన్ని సార్లు చాలా ఇబ్బంది అవుతుంది. కారణం ఒక్కో పరికరానికి ఒక్కో ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది. ఫలితంగా అవన్నీ మోసుకుని, వెంట వేసుకుని తిరిగే ఓపిక చాలా మందికి ఉండదు. అలాంటి టైం లోనే అనిపిస్తుంది. అన్నిటికీ ఒకే ఛార్జర్ ఉంటే బాగుండు కదా అని. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 90 శాతం మంది ఇలాగే ఫీల్ అవుతున్నారట. బ్రాండ్ ఏదైనా పర్లేదు కానీ.. అన్నిటికీ ఒకే ఛార్జర్ ఉంటే బెటర్ అని భావిస్తున్నారట. ఈ విషయాన్ని ఆన్‌లైన్ కమ్యూనిటీ ప్లాట్‌ఫారమ్ LocalCircles వెల్లడించింది.
భారతదేశంలోని 90 శాతం మంది వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌ల కోసం సాధారణ ఛార్జింగ్ కేబుల్ ప్రమాణాన్ని ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ప్రణాళికకు అనుకూలంగా ఉన్నారని వెల్లడించింది. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించడం, ఛార్జింగ్ సొల్యూషన్‌లను క్రమబద్ధీకరించడం వంటి ప్రణాళికల్లో భాగంగా, భారత ప్రభుత్వం మార్చి 2025 నాటికి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు యూనివర్సల్ ఛార్జింగ్ పోర్ట్‌గా USB టైప్-సీని స్వీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
70 శాతం మంది ప్రతివాదులు వివిధ పరికరాల కోసం వేర్వేరు ఛార్జర్‌ల అదనపు ఉపకరణాలను విక్రయించడానికి కంపెనీలను అనుమతిస్తుంది అని అధ్యయనం తెలిపింది. దీనికి విరుద్ధంగా కేవలం 6 శాతం మంది యూజర్స్ మాత్రం ప్రస్తుత సిస్టమ్‌తో సంతృప్తిగా ఉన్నామని చెప్పారట. జూన్ 2025 నాటికి ఉమ్మడి ఛార్జింగ్ పోర్ట్‌ను అమలు చేయాలని యోచిస్తున్న యూరోపియన్ యూనియన్ ను స్పోర్టివ్ గా తీసుకున్న వినియోగదారుల వ్యవహారాల కమిటీ ఇండియాలోనూ ఈ తరహా ప్రణాళికలను అమలు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఛార్జర్‌ల సంఖ్యను తగ్గించడంతో పాటు ఇ-వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించడమే ఈ నిర్ణయం వెనక ఉన్న ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది.
నివేదిక ప్రకారం, సర్వే చేసిన వినియోగదారులలో 78 శాతం మంది బ్రాండ్‌తో సంబంధం లేకుండా అన్ని స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు ఒకే USB ఛార్జింగ్ కేబుల్‌ను ఉపయోగించాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒక్కో పరికరానికి ఒక్కో ఛార్జింగ్ కేబుల్ ఉండడం వల్ల, యాక్సెసరీ మెయింటైన్ చేయడం బ్రాండెడ్ ఛార్జింగ్ ల కోసం వెచ్చించాల్సి ఆర్థిక భారంతో విసిగిపోయిన యూజర్స్ ఈ నిర్ణయానికి అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది.