TGEAPCET ఫస్ట్ కౌన్సిలింగ్‍లో 99 శాతం సీట్లు కేటాయింపు

TGEAPCET ఫస్ట్ కౌన్సిలింగ్‍లో 99 శాతం సీట్లు కేటాయింపు

తెలంగాణ ఇంజినీరింగ్, అగ్రికల్చరల్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TGEAPCET) ఫస్ట్ కౌన్సెలింగ్‌లో 99.31శాతం సీట్లను భర్తీ చేసినట్లు తెలంగాణ టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ ప్రకటించింది. శుక్రవారం TGEAPCET ఫస్ట్ కౌన్సిలింగ్ ఫలితాలను విడుదల చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ (CSE) వంటి కోర్సుల్లో సీట్లు పూర్తిగా ఫిల్ అయ్యాయని తెలిపారు. టెక్నికల్ కోర్సులు చదవడానికి చాలామంది అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు. 

కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ కోర్సులకు చాలా దగ్గర సంబంధం ఉంది. వాటిలో మొత్తం 99.80 శాతం సీట్లు కేటాయించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సులు 99.48శాతం భర్తీ అయ్యాయి. డేటా సైన్స్ గ్రూప్ ఎంచుకున్న విద్యార్థులు 99.36శాతం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కోర్సులో 98.83శాతం అడ్మిషన్లు కేటాయించామని అధికారులు వెల్లడించారు.