భార్య గొంతుకోసి చంపేశాడు..భర్తను పట్టించిన సోషల్ మీడియా ఫొటోలు

భార్య గొంతుకోసి చంపేశాడు..భర్తను పట్టించిన సోషల్ మీడియా ఫొటోలు

పథకం ప్రకారం హత్య..భార్యపై అనుమానం పెంచుకున్న భర్త..కుంభమేళాకు తీసుకెళ్లి అక్కడే ఆమెను దారుణంగా చంపేశాడు. అమ్మ ఏదీ నాన్న అని అడిగిన పిల్ల లకు కుంభమేళాలో తప్పిపోయిందని నమ్మబలికాడు. అయితే నిందితుడు సోషల్ మీడియాలో పెట్టిన ఫొటోలు అతని బండారం బయటపెట్టాయి. వివరాల్లోకి వెళితే.. 

ఢిల్లీలోని త్రిలోక్ పురికి చెందిన 48యేళ్ల అశోక్ కుమార్, మీనాక్షి భార్యభర్తలు. మీనాక్షి మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అశోక్  కుమార్ కు అనుమానం. అది పెనుభూతమై ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. చివరికి హత్యకు దారి తీశాయి. 

భార్యను ఎలాగైన హత్య చేయాలనుకున్న అశోక్ కుమార్.. భార్యను కుంభమేళాలో చంపేసి తప్పిపోయిందని చెపితే అందరూ నమ్ముతారని ప్లాన్ వేశాడు. అనుకున్న ప్లాన్ ప్రకారం.. ఫిబ్రవరి 17న ఢిల్లీ నుంచి ప్రయాగ్ రాజ్ కు భార్యభర్తలు వచ్చారు. ఝాన్సీలో ఓ రూం అద్దెకు తీసుకున్నారు. కుంభమేళాకు వచ్చినట్లు ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అశోక్ కుమార్. అదే రాత్రి మీనాక్షి గొంతు కోసి హత్య చేసి బాత్ రూంలో పడేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఏమీ తెలియనట్లు ఢిల్లీకి వెళ్లాడు.. అమ్మ ఏదీ నాన్న అని పిల్లలు అడిగితే కుంభమేళాలో తప్పిపోయిందని నమ్మబలికాడు. 

మరుసటి రోజు బాత్రూంలో మృతదేహాన్ని గుర్తించిన ఇంటి ఓనర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మీనాక్షి మృతదేహాన్ని రికవరీ చేసి పోస్ట్ మార్టమ్ పంపారు. అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఆమె ఎవరేది ఎలా గుర్తించాలో కష్టంగా మారింది. అయితే అశోక్ కుమార్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులే పోలీసులకు ఆధారమయ్యాయి. 

అశోక్ కుమార్ ఫొటోలను సోషల్ మీడియాలో, పేపర్లలో ప్రచురించారు. అశోక్ కుమార్ ను అరెస్ట్ చేసిన పోలీసులకు విచారణలో సంచలన విషయాలు తెలిశాయి. మూడునెలలుగాభార్యను చంపేందుకు ప్రయత్నించానని..భార్యపై అనుమానంతో పథకం ప్రకారమే కుంభమేళాకు తీసుకెళ్లి గొంతుకోసి హత్య చేశానని నిందితుడు ఒప్పుకున్నాడు.