ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఓ రాజకీయ నేతకు చెందిన ఇండ్లలో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహించగా.. గుట్టలుగా నోట్ల కట్టలు బయట పడ్డాయి. ఒకటి కాదు రెండు ఏకంగా 156 బ్యాంగుల్లో 200 కోట్ల రూపాయల నోట్ల కట్టలు వెలుగు చూశాయి. వాటిని లెక్కపెట్టేందుకు అధికారులు కౌంటింగ్ మెషీన్లు పెట్టి గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
ఒడిశాలోని రాంచీలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు నివాసంపై దాడి చేశారు ఆదాయపు పన్న శాఖ అధికారులు. ధీరజ్ కు సంబంధించిన డిస్టిలరీ గ్రూప్ అనుబంధ సంస్థలపై దాడుల తర్వాత 220 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఒడిశాకు చెందిన మద్యం కంపెనీకి జార్ఖండ్ కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహుతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒడిశాలోని బౌద్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నగదు సీజ్ చేశారు ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు.
ఇన్ కమ్ ట్యాక్స్ అధికారుల దాడుల్లో రూ. 220 కోట్లకు పైగా పట్టుబడటంపై ప్రధాని మోదీ స్పందించారు. అవినీతికి పాల్పడిన వారిపై తీవ్రంగా విరుచుకు పడ్డారు.
దేశ ప్రజలు ఈ నోట్ల కుప్పను చూసి ఆపై వారి నేత నిజాయితీ ప్రసంగాలను వినాలి.. ప్రజల నుంచి ఏది దోచుకున్నా ప్రతి పైసా వాపసు ఇవ్వాల్సిందేని అన్నారు.
ఒడిశాలో భారీగా నగదు స్వాధీనం ఐటీ శాఖ అధికారులు స్పందించారు. ఒడిశాలో ఇంత పెద్ద మొత్తంలో నగదు రికవరీ కావదం నేను ఎప్పుడు చూడలేదు.. అతిపెద్ద అవినీతి నగదు ఇదే కావచ్చాని ఐటీ మాజీ కమిషనర్ శరత చంద్ర దాస్ తెలిపారు. ఐటీ శాఖ అధికారులే నివ్వెర పోయారంటే.. భారీ దోపకమే..