కరీంనగర్ టౌన్, వెలుగు : రెండు రోజుల పాటు కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్ లో జరిగిన 9వ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను నల్గొండ జిల్లా జట్టు కైవసం చేసుకుంది. ఆదివారం ముగింపు కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, మేయర్సునీల్రావు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడల్లో రాణించిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. క్రీడలతో మానసిక ఉత్సాహం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్, జిల్లా ఒలింపిక్అసోసియేషన్ అధ్యక్షుడు మహిపాల్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.