- 2.16 లక్షల జాబ్ పోస్టింగ్స్
న్యూఢిల్లీ: ఈ ఏడాది పండుగ సీజన్‌లో తమ ప్లాట్‌ఫామ్‌లో 2.16 లక్షల జాబ్ పోస్టింగ్స్ జరిగాయని అప్నాడాట్‌కామ్ ప్రకటించింది. కిందటేడాది పండుగ సీజన్‌తో పోలిస్తే 20 శాతం పెరిగాయని పేర్కొంది. లాజిస్టిక్స్ అండ్ ఆపరేషన్స్, ఈ–కామర్స్, హాస్పిటాలిటీ వంటి వివిధ సెక్టార్లలోని కంపెనీలు ఈ జాబ్స్‌ను పోస్ట్ చేశాయి. ఈ ఏడాది సమ్మర్, ఎలక్షన్స్ టైమ్‌లో వినియోగం పడిపోయింది. దీని నుంచి రికవరీ అవ్వడానికి కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. కిందటేడాది పండుగ సీజన్ కంటే ఎక్కువ అమ్మకాలు జరిపేందుకు నియామకాలు పెంచాయి.
దీంతో పాటు క్విక్ కామర్స్ కంపెనీలు వేగంగా విస్తరిస్తుండడంతో కూడా నియామకాలు ఊపందుకున్నాయి. లాజిస్టిక్స్ ఆపరేషన్స్ సెక్టార్‌లో ఎక్కువ జాబ్‌లు పోస్ట్ అయ్యాయని అప్నా పేర్కొంది. కిందటేడాది పండుగ సీజన్‌తో పోలిస్తే 70 శాతం పెరిగాయని తెలిపింది. రిటైల్, ఈ–కామర్స్ సెక్టార్‌లో 30 శాతం గ్రోత్, రెస్టారెంట్ అండ్ హాస్పిటాలిటీ సెక్టార్‌లో 25 శాతం గ్రోత్ కనిపించిందని పేర్కొంది. డిమాండ్‌ను చేరుకోవడానికి రాపిడో, డెల్హివరీ, ఈకార్ట్, షిప్‌రాకెట్ వంటి కంపెనీలు 30 వేల జాబ్ పోస్టింగ్స్ చేశాయి. ఇందులో వేర్‌హౌస్ మేనేజర్స్, లాజిస్టిక్స్ అసోసియేట్స్, ఇన్వెంటరీ మేనేజర్స్, డెలివరీ డ్రైవర్స్ వంటి రోల్స్ కోసం ఉద్యోగులను ఎక్కువగా వెతికాయి.