
నాలుగు రోజులుగా కురుస్తున్న వానలకు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ వ్యాప్తంగా చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలకు జనజీవనం స్తంభించి పోయింది. పలు చోట్ల వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో పంట పొలాలు నీటమునిగాయి. కొన్ని గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి.
వర్షం దాటికి ఫరూక్ నగర్ మండలం అయ్యవారిపల్లి వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. రోడ్డుపై వాగు పొంగడంతో రాకపోకలు స్తంభించాయి. ఫరూక్ నగర్ లోని బొబ్బిలి చెరువు నిండి అలుగు పారుతుంది. అప్రమత్తమైన పోలీసుశాఖ వాగులు, చెక్‌డ్యామ్‌ల వద్దకు జనం రావద్దని, వాగుల వెంట ఉన్న దారుల్లో వాహనాలు అప్రమత్తంగా నడపాలని, సాహసాలు చేయొద్దని, చేపల వేటకు వెళ్లద్దని హెచ్చరికలు జారీ చేశారు.