బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా దీటుగా ఆడుతోంది. ఓవర్‌నైట్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజ (126 బ్యాటింగ్) అజేయ సెంచరీతో చెలరేగడంతో.. శనివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 94 ఓవర్లలో 311/5 స్కోరు చేసింది. ఖవాజాతో పాటు అలెక్స్ క్యారీ (52 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం కంగారూలు ఇంకా 82 రన్స్ వెనకబడి ఉన్నారు. 14/0 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన ఆసీస్‌ను బ్రాడ్ (2/49) ఘోరంగా దెబ్బకొట్టాడు.
11వ ఓవర్‌లో వరుస బాల్స్‌లో వార్నర్ (9), లబుషేన్ (0)ను ఔట్ చేశాడు. దీంతో 29/2 స్కోరుతో కష్టాల్లో పడిన కంగారూలను ఖవాజ ఒంటరి పోరాటంతో ఆదుకున్నాడు. ఓ ఎండ్‌లో స్థిరంగా ఆడుతూ మంచి పార్ట్‌నర్‌షిప్స్‌తో స్కోరు బోర్డును కాపాడాడు. రెండో ఎండ్‌లో స్టీవ్ స్మిత్ (16) నిరాశపర్చినా, ట్రావిస్ హెడ్ (50) హాఫ్ సెంచరీతో ఖవాజకు మంచి సహకారం అందించాడు. నాలుగో వికెట్‌కు 81 రన్స్ జోడించి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన కామోరున్ గ్రీన్ (38) కూడా నిలకడగా ఆడి ఐదో వికెట్‌కు 72 రన్స్ జత చేశాడు. చివర్లో అలెక్స్ క్యారీ ఆరో వికెట్‌కు 91 రన్స్ జోడించాడు. స్పిన్నర్ మొయిన్ అలీ 2 వికెట్లు తీశాడు.