ఆదివాసీ విద్యార్థులందరికీ ఓవర్సీస్ స్కాలర్​షిప్​లు

  • అధికారికంగా కుమ్రంభీం జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యంతి, వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ధంతి
  • ఆదివాసీల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పెట్టిన ఉద్యమ కేసులు ఎత్తివేస్తం
  • సాగుకు ఉచితంగా సోలార్ పంపు సెట్లు
  • ఆదివాసీ సంఘాలు, నాయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ముఖ్యమంత్రి

హైద‌‌‌‌‌‌‌‌రాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేసేందుకు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఆదివాసీ విద్యార్థికి ఓవర్సీస్ స్కాలర్ షిప్ మంజూరు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రక‌‌‌‌‌‌‌‌టించారు. ఆదివాసీల‌‌‌‌‌‌‌‌పై ఉద్యమాల స‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌యంలో పెట్టిన కేసులను ఎత్తివేస్తామ‌‌‌‌‌‌‌‌ని.. దీనికి అవ‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌మైతే శాస‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌భ‌‌‌‌‌‌‌‌లో చ‌‌‌‌‌‌‌‌ర్చపెట్టి తీర్మానం చేస్తామ‌‌‌‌‌‌‌‌ని వెల్లడించారు. ఆదివాసీ యోధుడు కుమ్రం భీం జ‌‌‌‌‌‌‌‌యంతి.. వ‌‌‌‌‌‌‌‌ర్ధంతిని అధికారికంగా (స్టేట్ ఫంక్షన్‌‌‌‌‌‌‌‌గా) నిర్వహిస్తామ‌‌‌‌‌‌‌‌ని ప్రక‌‌‌‌‌‌‌‌టించారు. ఇందుకు  సం బంధించి వెంట‌‌‌‌‌‌‌‌నే ఉత్తర్వులు జారీ చేయాల‌‌‌‌‌‌‌‌ని చీఫ్ సెక్రటరీ శాంతికుమారిని ఆదేశించారు.

శుక్రవారం ఆదివాసీ సంఘాలు, నాయ‌‌‌‌‌‌‌‌కుల‌‌‌‌‌‌‌‌తో సీఎం రేవంత్ రెడ్డి స‌‌‌‌‌‌‌‌చివాల‌‌‌‌‌‌‌‌యంలో స‌‌‌‌‌‌‌‌మావేశ‌‌‌‌‌‌‌‌మయ్యారు. త‌‌‌‌‌‌‌‌మ ప్రాంతా ల్లో రవాణా, సాగు, తాగునీరు, త‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌పై న‌‌‌‌‌‌‌‌మోదైన‌‌‌‌‌‌‌‌, న‌‌‌‌‌‌‌‌మోదవుతున్న కేసులు, విద్య, ఉద్యోగ‌‌‌‌‌‌‌‌, ఆర్థిక స‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌స్య ల‌‌‌‌‌‌‌‌ను ఆదివాసీ నాయ‌‌‌‌‌‌‌‌కులు సీఎంకు వివ‌‌‌‌‌‌‌‌రించారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాల‌‌‌‌‌‌‌‌ని.. ఎట్టి ప‌‌‌‌‌‌‌‌రిస్థితుల్లోనూ ఆందోళ‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌కు దిగ‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌ద్దని సీఎం సూచించారు. యువకులపై కేసులు నమోదైతై వారు విలువైన భవిష్యత్తును కోల్పోతారని చెప్పారు. తాను పీసీసీ అధ్యక్షుడైన త‌‌‌‌‌‌‌‌ర్వాత తొలి స‌‌‌‌‌‌‌‌మావేశం ఇంద్రవెల్లిలోనే పెట్టాన‌‌‌‌‌‌‌‌ని, నాటి స‌‌‌‌‌‌‌‌మావేశంలో ఇంద్రవెల్లి అమ‌‌‌‌‌‌‌‌రుల స్మృతివ‌‌‌‌‌‌‌‌నం ఏర్పాటు, అమ‌‌‌‌‌‌‌‌రుల కుటుంబాల‌‌‌‌‌‌‌‌కు ఇళ్ల మంజూరు వంటి అంశాలు తన దృష్టిలోకి వచ్చాయన్నారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రెండు పనులూ పూర్తి చేశామన్నారు. రాజకీయంగా ఆదివాసీలకు అన్యాయం జరగకుండా చూస్తున్నామని, అందుకే సీతక్కను ఆదిలాబాద్ జిల్లాకు ఇంచార్జి మంత్రిగా పెట్టామని చెప్పారు. ఇకపై ప్రతి నాలుగు నెల‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌కు ఒక‌‌‌‌‌‌‌‌సారి గ‌‌‌‌‌‌‌‌త స‌‌‌‌‌‌‌‌మావేశంలో తీసుకున్న నిర్ణయాల అమ‌‌‌‌‌‌‌‌లు, రాబోయే కాలంలో ప‌‌‌‌‌‌‌‌రిష్కరించుకోవాల్సిన అంశాల‌‌‌‌‌‌‌‌పై చ‌‌‌‌‌‌‌‌ర్చిద్దామ‌‌‌‌‌‌‌‌న్నారు.    

ఆదివాసీల‌‌‌‌‌‌‌‌కు ప్రత్యేక స్టడీ స‌‌‌‌‌‌‌‌ర్కిల్‌‌‌‌‌‌‌‌ 

ఆదివాసీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్టడీ స‌‌‌‌‌‌‌‌ర్కిల్ ఏర్పాటు చేయాల‌‌‌‌‌‌‌‌ని సీఎం రేవంత్ ఆదేశించారు. స్టడీ స‌‌‌‌‌‌‌‌ర్కిల్‌‌‌‌‌‌‌‌ భ‌‌‌‌‌‌‌‌వన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ఆదివాసీ విద్యా ర్థులందరికీ ఓవర్సీస్ స్కాలర్ షిప్​లు మంజూరు చేస్తామని సీఎం ప్రకటించారు. విద్యార్థుల దరఖాస్తులను వెంటనే మంత్రి సీతక్కకు అందజేయాలని సూచించారు. అదేవిధంగా గోండీ భాష‌‌‌‌‌‌‌‌లో ప్రాథ‌‌‌‌‌‌‌‌మిక విద్యను బోధించడంపై అధ్యయ‌‌‌‌‌‌‌‌నం చేసి నివేదిక స‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌ర్పించాల‌‌‌‌‌‌‌‌ని అధికారుల‌‌‌‌‌‌‌‌ను ఆదేశించారు. ఉట్నూరు, భ‌‌‌‌‌‌‌‌ద్రాచ‌‌‌‌‌‌‌‌లం ట్రైబ‌‌‌‌‌‌‌‌ల్‌‌‌‌‌‌‌‌ బీఈడీ కాలేజీల్లో టీచింగ్‌‌‌‌‌‌‌‌, నాన్ టీచింగ్ పోస్టుల భ‌‌‌‌‌‌‌‌ర్తీకి  చ‌‌‌‌‌‌‌‌ర్యలు తీసుకోవాల‌‌‌‌‌‌‌‌న్నారు. ఆదివాసీ విద్యార్థుల‌‌‌‌‌‌‌‌కు స్కిల్ యూనివ‌‌‌‌‌‌‌‌ర్సిటీలో ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామ‌‌‌‌‌‌‌‌ని సీఎం తెలిపారు.

ఏజెన్సీలోని ఐటీఐల‌‌‌‌‌‌‌‌ను ఏటీసీలుగా మారుస్తున్నామ‌‌‌‌‌‌‌‌ని, వాటిలో ఆదివాసీ విద్యార్థులు చేరేలా ప్రోత్సహించాల‌‌‌‌‌‌‌‌ని సూచించారు. ఆదివాసీలకు ఎమ్మెల్యేల కోటా కింద ఇచ్చే ఇండ్లతో సంబంధం లేకుండా సీఎం కోటా కింద జ‌‌‌‌‌‌‌‌నాభా ప్రాతిప‌‌‌‌‌‌‌‌దిక‌‌‌‌‌‌‌‌న ప్రత్యేకంగా ఇండ్లు మంజూరు చేస్తామ‌‌‌‌‌‌‌‌న్నారు. నాన్ ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీల‌‌‌‌‌‌‌‌కూ ఇండ్లు కేటాయిస్తామని తెలిపారు. ఆదివాసీ రైతుల‌‌‌‌‌‌‌‌కు ఉచితంగా సోలార్ పంపుసెట్లు (వంద శాతం రాయితీ), ఇండ్లకు సోలార్ కరెంట్ అందిస్తామ‌‌‌‌‌‌‌‌ న్నారు. ఇందిర జ‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌ప్రభ కింద ఉచితంగా బోర్లు వేయడంపైనా అధ్యయ‌‌‌‌‌‌‌‌నం చేసి నివేదిక ఇవ్వాలని అధికారు లను సీఎం ఆదేశించారు. ఆదివాసీ గూడేల్లో తాగు నీటి స‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌స్య త‌‌‌‌‌‌‌‌లెత్తకుండా చ‌‌‌‌‌‌‌‌ర్యలు తీసుకోవాల‌‌‌‌‌‌‌‌ని, ఐటీడీఏల ప‌‌‌‌‌‌‌‌రిధిలో స్పెష‌‌‌‌‌‌‌‌ల్ డ్రైవ్ చేప‌‌‌‌‌‌‌‌ట్టాల‌‌‌‌‌‌‌‌న్నారు. 

కేస్లాపూర్ జాత‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌కు నిధులు 

కేస్లాపూర్ జాత‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌కు నిధులు మంజూరు చేయాల‌‌‌‌‌‌‌‌ని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. అలాగే, రాయి సెంట‌‌‌‌‌‌‌‌ర్లకు ఎన్ని భవనాలు అవసరం? అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని చెప్పారు. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా భవనాల డిజైన్లను తయారు చేయించాలని మంత్రి సీతక్కకు సూచించారు. స‌‌‌‌‌‌‌‌మావేశంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మాజీ ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం స‌‌‌‌‌‌‌‌క్కు, ప్రొఫెస‌‌‌‌‌‌‌‌ర్ గుమ్మడి అనూరాధ‌‌‌‌‌‌‌‌, ఆదివాసీ సంఘాల నాయ‌‌‌‌‌‌‌‌కులు పాల్గొన్నారు.