అగ్రరాజ్యం అమెరికాలో వరుసగా సంభిస్తున్న భారతీయుల మరణాలు బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గుజరాత్ మహిళలు చనిపోయారు. ఆనంద్ జిల్లాకు చెందిన రేఖాబెన్ పటేల్, సంగీతబెన్ పటేల్, మనీషాబెన్ పటేల్ కార్ యాక్సిడెంట్ లో మృతి చెందారు. దక్షిణ కరోలినాలోని గ్రీన్‌విల్లే కౌంటీలో ఈ ముగ్గురు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పింది. ఆ కారులో నలుగురు ఉన్నారు.
స్పీడ్ గా వెళ్తున్న ఎస్‌యూవీ కారు 20 ఫీట్ల ఎత్తులో గాలిలోకి ఎరిగింది. అక్కడ ఉన్న చెట్లను ఢికొట్టి గ్రీన్‌విల్లే కౌంటీ పోలీసులు తెలిపారు.అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. ఆ కారును ఓ చెట్టుపై గుర్తించారు. కారు చాలా స్పీడ్ లో ఉన్నందున అందులో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. ఒకరు ప్రాణాలతో బయట పడి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు.